సెల్ఫీ లవర్స్‌కు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్

|

సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లను రూపొందించటంలో నెం.1 బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఒప్పో, తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా సరికొత్త సెల్ఫీ టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంది. ఇటీవల ఈ బ్రాండ్ నుంచి విడుదలైన లేటెస్ట్ సెల్ఫీ సెంట్రిక్ ఫోన్ 'ఒప్పో ఎఫ్5’ ఏకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీనే ఫోన్ ఫ్రంట్ కెమెరాలోకి తీసుకువచ్చేసింది.

 
సెల్ఫీ లవర్స్‌కు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్

ఈ ఫోన్‌కు ప్రధాన హైలైట్ నిలిచిన AI బ్యూటీ టెక్నాలజీ సహజసిద్ధమైన అందంతో మునుపెన్నడూ చూడని సెల్ఫీలను అందిస్తుంది..

సెల్ఫీలు ఎంత క్లియర్‌గా ఉంటాయంటే?

సెల్ఫీలు ఎంత క్లియర్‌గా ఉంటాయంటే?

ఒప్పో ఎఫ్5లో నిక్షిప్తం చేసిన 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బిల్ట్-ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వస్తోంది. సెల్ఫీ ఫోటో తీసుకునే సమయంలో ఈ టెక్నాలజీ ఏకంగా 200 ఫేషియల్ రికగ్నిషన్ స్పాట్‌లను రికార్డ్ చేసి ఫైనల్ అవుట్ పుట్‌ను బెస్ట్ క్వాలిటీతో అందిస్తుంది.

స్కిన్ టోన్ పై లోతైన విశ్లేషణ

స్కిన్ టోన్ పై లోతైన విశ్లేషణ

మెచిన్ లెర్నింగ్ టెక్నాలజీ పై స్పందించగలిగే ఒప్పో ఎఫ్5 ఫ్రంట్ కెమెరా ఇమేజ్‌లోని సబ్జెక్ట్‌ స్కిన్ టోన్, కలర్, ఏజ్ ఇంకా జెండర్‌ను గుర్తించి అందుకు అనుగుణంగా మెరుగులను అద్దుతుంది.

AI బ్యూటీ టెక్నాలజీలోని కాంప్లెక్స్ అల్గోరిథం వ్యవస్థ మేల్, ఫిమేల్ సబ్జెక్ట్‌లను క్షుణ్నంగా వేరు చేసి వాటికి తిగిన విధంగా సబ్టిల్ ఎన్‌హాన్స్‌మెంట్స్‌ను అద్దతుంది. దీంతో అసహజ ఎన్‌హాన్స్‌మెంట్స్‌ అనేవి సెల్ఫీల్లో కనిపించవు.

రూ. 10 వేల కన్నా తక్కువ ధరలో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్లురూ. 10 వేల కన్నా తక్కువ ధరలో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్లు

ముఖం పై మచ్చలనేవి కనిపించవు..
 

ముఖం పై మచ్చలనేవి కనిపించవు..

AI బ్యూటీ టెక్నాలజీతో క్యాప్చుర్ చేసే ప్రతి రియల్ ఇమేజ్‌కు కస్టమైజిడ్ బ్యూటీ ఎఫెక్ట్ అనేది అద్దబడుతుంది. మీరు ఎటువంటి వాతావరణంలో ఉన్నప్పటికి ఫోటోలో మాత్రం సహజసిద్ధమైన లుక్‌లో యాక్యురేట్ స్కిన్ టోన్‌లను కలిగి ఉంటారు. ముఖం పై మచ్చలనేవి కనిపించవు.

బెస్ట్-క్లాస్ రిజల్ట్స్...

బెస్ట్-క్లాస్ రిజల్ట్స్...

ఒప్పో ఎఫ్5 లాంచ్‌తో, స్మార్ట్‌ఫోన్ కెమెరాలోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తీసుకువచ్చిన మొట్టమొదటి బ్రాండ్‌గా ఒప్పో చరిత్ర సృష్టించింది. అనేక సంవత్సరాల రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ తరువాత ఈ విప్లవాత్మక ఫీచర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు ఒప్పో తెలిపింది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ టెక్నాలజీ, గ్లోబల్ డేటా బేస్ రిఫరెన్స్‌తో యూజర్ ముఖానికి సంబంధించిన ఫేషియల్ షీచర్స్, షేప్స్ ఇంకా స్ట్రక్షర్‌ను ఐడెంటిఫై చేయటం జరుగుతుంది. ఈ ఫీచర్‌ను మరింత సహజసిద్ధంగా మలిచే క్రమంలో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్‌తో పాటు మేకప్ ఆర్టిస్టుల సలహాలు, సూచనలను పరిగణంలోకి తీసుకున్నట్లు ఒప్పో తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
OPPO F5 sports a 20MP front-facing camera with built-in AI Beauty Technology.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X