మైక్రోసాఫ్ట్, నోకియా చివరి ఫోన్ వచ్చేసింది, రూ.2495కే
మైక్రోసాఫ్ట్, సరికొత్త నోకియా డ్యుయల్ సిమ్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో మంగళవారం విడుదల చేసింది. Nokia 216 Dual SIM పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.2465.

అక్టోబర్ 26 నుంచి మార్కెట్లో దొరుకుతుంది. రెండు ఎల్ఈడి ఫ్లాష్ కెమెరాలతో వస్తోన్న ఈ ఫోన్ ద్వారా క్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు.
Read More : Xiaomi నుంచి 8జీబి ర్యామ్ ఫోన్ వచ్చేస్తోంది, ధర రూ.25000లే!

ఫోన్ స్పెసిఫికేషన్స్...
2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే (రిసల్యూషన్240× 320పిక్సల్స్), నోకియా సిరీస్ 30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టం,

ఫోన్ స్పెసిఫికేషన్స్...
మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ఫోన్ స్పెసిఫికేషన్స్...
0.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్ సపోర్ట్, యూఎస్బీ 1.1, బ్లుటూత్, స్లామ్ సపోర్ట్)

కలర్ వేరియంట్స్
బ్లాక్, గ్రే ఇంకా బ్లు కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా వస్తోన్న ఒపెరా మొబైల్ స్టోర్ ద్వారా ఏడాది పాటు నెలకో గేమ్ లాఫ్ట్ గేమ్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మైక్రోసాఫ్ట్ ఆఖరి ఫోన్!
ఈ ఏడాదికి గాను మైక్రోసాఫ్ట్ నుంచి లాంచ్ అయిన మొట్టమొదటి ఫీచర్ ఫోన్‌గా నోకియా 216 డ్యుయల్ సిమ్ ఫోన్ నిలిచింది. మైక్రోసాఫ్ట్ నుంచి విడుదలవుతోన్న ఆఖరి ఫీచర్ ఫోన్ కూడా ఇదే కావటం విశేషం.

నోకియా బ్రాండ్ హక్కులను
నోకియా బ్రాండ్ హక్కులను హెచ్‌ఎండీ గ్లోబల్‌కు ఫాక్స్‌కాన్ కంపెనీలు 35 కోట్ల డాలర్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో నోకియా బ్రాండ్ ఫోన్లు, టాబ్లెట్లను హెచ్‌ఎండి గ్లోబల్ లిమిటెడ్ తయారు చేయబోతోంది.

లైసెన్సుతో పాటు ఐపిఆర్ హక్కులు
నోకియాకు సంబంధించిన అంతర్జాతీయ లైసెన్సుతో పాటు ఐపిఆర్ హక్కులు కూడా హెచ్‌ఎండి గ్లోబల్ లిమిటెడ్ క్రిందే ఉంటాయి. హెచ్‌ఎండిలో నోకియాకు డైరెక్టర్ పదవి లభిస్తుంది.


Click it and Unblock the Notifications








