నథింగ్ సబ్‌బ్రాండ్ CMF తొలి స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వెల్లడి.. స్పెసిఫికేషన్‌ల పూర్తి వివరాలు..!!
నథింగ్ సబ్ బ్రాండ్ CMF కీలక ప్రకటన చేసింది. CMF బ్రాండ్ తో తొలి స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే సంస్థ ప్రకటన చేసింది. అయితే తాజాగా CMF ఫోన్ 1 (CMF Phone 1 Launch Date) విడుదల తేదీని ప్రకటించింది. ఈ ఫోన్‌తోపాటు CMF బడ్స్ ప్రో 2 (CMF Buds Pro 2), CMF వాచ్ ప్రో 2 (CMF Watch Pro 2) కూడా విడుదల కానున్నాయని సంస్థ X ప్లాట్‌ఫాంలో పోస్ట్ చేసింది. ఈ మూడు ఉత్పత్తుల విడుదల కార్యక్రమం జూలై 8 మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
CMF ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్ టీజర్ ఇటీవల విడుదల అయింది. టీజర్ ఆధారంగా ఈ హ్యాండ్ సెట్ రొటేటింగ్ డయల్ ను కలిగి ఉంది. ఈ డయల్ ద్వారా మీడియా ప్లేబ్యాక్, వాల్యూమ్ నియంత్రించేందుకు ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్ సెట్ మ్యాటీ బ్లాక్ ఫినిష్ వెనుక ప్యానల్‌ను కలిగి ఉంది.

ఇప్పటికి వరకు లీకైన వివరాల ఆధారంగా CMF ఫోన్ 1 హ్యాండ్ సెట్ 6.7 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు గ్లిఫ్ లైట్‌లను కలిగి ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.
ఈ సీఎంఎఫ్ స్మార్ట్‌ఫోన్.. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్OS 2.5 పైన పనిచేస్తుందని తెలుస్తోంది. 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. 3 సంవత్సరాల OS, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చని తెలుస్తోంది.

కెమెరా విభాగం పరంగా ఈ CMF ఫోన్ 1 వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా సహా మరో కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వెనుక కవర్ ప్లాస్టిక్‌తో (Replaceable Plastic) రూపొందినట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. బ్లాక్, బ్లూ, గ్రీన్ సహా భారత్‌లో ఆరెంజ్ కలర్ వేరియంట్‌ను కూడా అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.20000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫోన్‌తోపాటు CMF బడ్స్ ప్రో 2 మరియు CMF వాచ్ ప్రో 2 కూడా జులై 8న విడుదల కానున్నాయి. అయితే వీటి ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడి కాలేదు. వాచ్ ప్రో వృత్తాకార డయల్ సహా స్మార్ట్ డయల్ ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications