మతిపోగొడుతున్న నథింగ్ సబ్‌బ్రాండ్ కొత్త ఫోన్ డిజైన్.. తాజాగా కెమెరా సహా కీలక వివరాలు వెల్లడి..!!
నథింగ్ సబ్‌బ్రాండ్ CMF నుంచి తొలి స్మార్ట్‌ఫోన్ CMF ఫోన్ 1 (CMF Phone 1) .. జులై 8 న విడుదల కానుంది. ఫోన్‌తోపాటు బడ్స్, వాచ్ కూడా అందుబాటులోకి రానుంది. అయితే CMF నుంచి ఒక్కొ్క్కటిగా డిజైన్ సహా కీలక వివరాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే డిజైన్‌తో ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ మరియు కెమెరా వివరాలను వెల్లడించింది.
తాజాగా వచ్చిన వివరాల ఆధారంగా ఈ CMF ఫోన్ 1.. వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP సోనీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా అల్ట్రా XDR ఫీచర్ పైన పనిచేస్తుంది. మరియు ఆకట్టుకొనే ఫోటోలు తీసేందుకు వీలుంటుందని తెలిపింది. ఈ కెమెరాతో తక్కువ కాంతి ఉన్న సమయాల్లోనూ నాణ్యమైన ఫోటోలు తీసేందుకు అవకాశం ఉంటుందని నథింగ్ వెల్లడించింది.

దీంతోపాటు మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్‌ను అవసరమైన సమయాల్లో బయటకు తీసి అమర్చుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అందుకు అనుగుణంగా స్క్రూ లను (Screws) గుర్తించవచ్చు. అయితే ఈ తరహా డిజైన్‌ను ఎందుకు తీసుకువస్తుందో సంస్థ వెల్లడించలేదు.
దీంతోపాటు ఇప్పటికే వెల్లడైన వివరాల ఆధారంగా ఈ ఫోన్ ఆరెంజ్ మరియు బ్లాక్ రంగుల్లో లభించనుంది. దీంతోపాటు ఫోన్ కింద వైపును వీల్‌ను గుర్తించవచ్చు. ఎందుకోసం వినియోగించనున్నారో తెలియలేదు. అయితే ఈ హ్యాండ్‌సెట్ రూ.20,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది.
ఇప్పటి వరకు విడుదలైన సమాచారం మరియు లీక్‌ల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్ కానుంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టును కలిగి ఉండనుంది తెలిసింది.
ఇటీవలే ఈ ఫోన్ ప్రాసెసర్ వివరాలను సంస్థ ధ్రువీకరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలిపింది. దీంతోపాటు 8GB ర్యామ్ స్టోరేజీతో అందుబాటులోకి రానుంది. ర్యామ్ బూస్ట్ టెక్నాలజీ ద్వారా 16GB వరకు ర్యామ్‌ను విస్తరించవచ్చు.
సంస్థ జులై 2 న వెల్లడించిన వివరాల ఆధారంగా డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ కెమెరా సహా మరో కెమెరాను కలిగి ఉండనుంది. అయితే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కెమెరాల ద్వారా 4K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చని తెలుస్తోంది.
ఈ CMF ఫోన్ 1.. 33W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుందని సమాచారం. అయితే ర్యామ్, స్టోరేజీపైన కచ్చితమైన వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ వైఫై 6, బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్‌లతో అందుబాటులోకి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు గ్లిఫ్ లైట్‌లను కలిగి ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








