నథింగ్ సబ్ బ్రాండ్ CMF నుంచి తొలి స్మార్ట్‌ఫోన్.. కీలక స్పెసిఫికేషన్ల వివరాలు లీక్.. లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ నుంచి ఇటీవల నథింగ్ ఫోన్ 2(a) భారత్‌లో విడుదల అయింది. అయితే నథింగ్ సబ్ బ్రాండ్ CMF తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ బ్రాండ్ నుంచి ఇయర్‌బడ్స్ వంటి గ్యాడ్జెట్లు విడుదల అయ్యాయి. అయితే CMF తొలి స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. తాజాగా ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది.
నథింగ్ సబ్ బ్రాండ్ CMF తొలి స్మార్ట్‌ఫోన్.. నథింగ్ ఫోన్ 2(a) తరహా స్పెసిఫికేషన్లను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. X యూజర్ MlgmXyysd వివరాల ఆధారంగా CMF ఫోన్ (1) (CMF Phone 1).. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు మీకోసం.

CMF ఫోన్ (1) అంచనా స్పెసిఫికేషన్లు :
సీఎంఎఫ్ ఫోన్ (1) 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ CMF స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ CMF తొలి స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్ మరియు 256GB స్టోరేజీ కలిగి ఉంటుంది. అయితే మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS 2.6 పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు మూడు సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందవచ్చు. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక కవర్ ప్లాస్టిక్‌తో (Replaceable Plastic) తయారుచేయబడుతుంది. మరియు వెనుక గ్లిఫ్ లైట్‌లను కలిగి ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.
కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. అందులో 50MP ప్రైమరీ కెమెరా సహా మరో కెమెరాతో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 16MP కెమెరాతో రానుంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
CMF ఫోన్ (1) ధర జులైలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర $249 గా (భారత కరెన్సీ ప్రకారం రూ.20,800) ఉంటుందని తెలుస్తోంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ వైఫై 6, బ్లూటూత్ 5.3, USB-C పోర్ట్‌ను కలిగి ఉంటుంది. పైన తెలిపిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు సహా ఇతర వివరాలపై CMF సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








