CMF ఫోన్ 2 బ్యాక్ ప్యానల్ ఎలా ఉంటుందంటే.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, విడుదల వివరాలు..!
నథింగ్ సబ్‌బ్రాండ్ CMF నుంచి గతంలో ఫోన్ 1 విడుదల అయింది. త్వరలో CMF ఫోన్ 2 లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన చాలా వివరాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను సంస్థ విడుదల చేసింది. అయితే గత మోడల్‌తో పోలిస్తే డిజైన్‌లో చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
CMF ఫోన్ 2 (CMF Phone 2) గురించి తాజాగా బ్యాక్ ప్యానల్ డిజైన్ విడుదల అయింది. ఈ వీడియోలో ఫోన్ బ్యాక్ ప్యానల్ కొంత భాగం విడుదల అయింది. ఈ ఫోన్ వెనుక వైపు ప్లాస్టిక్ ఎడ్జ్‌లను కలిగి ఉంది. మరియు మ్యాటీ ఫినిష్‌ను కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ ప్యానల్ ఏ మెటీరియల్‌తో తయారు చేశారనే వివరాలు వెల్లడి కాలేదు.

గతంలో వచ్చిన లీక్స్ ఆధారంగా ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ యాక్సెసరీ పాయింట్ సిస్టమ్ ను కలిగి ఉంటుందని సమాచారం. అయితే ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
గతంలో విడుదల అయిన వివరాల ఆధారంగా CMF ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో భారత్ మార్కెట్‌లోకి రానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 2500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మ్యాటీ ఫినిష్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
A new finish. Textured, tactile, different.
— CMF by Nothing (@cmfbynothing) April 5, 2025
More to come. pic.twitter.com/urfDleDieH
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత NothingOS 3.1 ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుందని తెలుస్తోంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. అయితే CMF ఫోన్ 2 తో పాటు CMF వాచ్ 3 ప్రో, CMF నెక్‌బ్యాండ్ ప్రో 2, CMF బడ్స్ ప్రో 3 కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నెలలోనే ఈ ఉత్పత్తులు లాంచ్ కానున్నాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న CMF ఫోన్ 1... మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 నథింగ్ OS 2.6 పైన పనిచేస్తోంది. మరియు 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలతో అందుబాటులో ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాతో అందుబాటులో ఉంది. మరియు ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ విడుదల సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14999 కు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications