Home
Mobile

బడ్జెట్ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లు.. అతి త్వరలోనే CMF ఫోన్ 2 ఇండియాలో లాంచ్..

CMF Phone 2: నథింగ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. పెట్టిన పైసలకు తగిన ఫీచర్లు ఇస్తుండటంతో నథింగ్ ఫోన్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాదు, వీటి డిజైన్ కూడా చాలా యూనిక్‌గా ఉండటంతో యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా కనిపించాలని కోరుకునే వాళ్లయితే నథింగ్ ఫోన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో CMF ఫోన్ 2 కోసం ఇండియన్ యూజర్స్ బాగా వెయిట్ చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ ఫోన్ త్వరలోనే ఇండియాలో లాంచ్ కానుందట. నథింగ్ ఫోన్ 3a మార్చిలో వస్తుందని అనుకుంటుండగానే, CMF ఫోన్ 2 కూడా రేసులోకి వచ్చేసింది. ఈ ఫోన్ భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) వెబ్‌సైట్‌లో దర్శనమివ్వడంతో, త్వరలోనే ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

CMF Phone 2 India Launch Imminent  Get Ready

* CMF ఫోన్ 2 BIS లిస్టింగ్‌లో.. లాంచ్ డేట్ ఫిక్సేనా!

CMF ఫోన్ 2 మోడల్ నంబర్ A001తో BIS వెబ్‌సైట్‌లో కనిపించడంతో, నథింగ్ సంస్థ CMF సిరీస్‌ను ఇండియాలో మరింత విస్తరించడానికి రెడీ అవుతోందని అర్థమవుతోంది. గతేడాది CMF ఫోన్ 1తో సంచలనం సృష్టించిన ఈ బ్రాండ్, ఇప్పుడు CMF ఫోన్ 2తో మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో మరోసారి దుమ్ము దులపడానికి వస్తోంది.

* CMF ఫోన్ 2 ధర ఎంత ఉండొచ్చు?

CMF ఫోన్ 1 గతేడాది 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌తో రూ.15,999 ధరతో లాంచ్ అయింది. అలాగే 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ.18,000 వరకు ఉంది. CMF ఫోన్ 2 దీనికి అప్‌గ్రేడ్ వెర్షన్ కాబట్టి, దాదాపు ఇదే ధరల్లో ఉండొచ్చని అంచనా.

* CMF ఫోన్ 2లో ఏ ఫీచర్లు ఉండొచ్చు?

6.7-అంగుళాల ఫుల్ HD+ స్క్రీన్‌తో వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడటానికి సూపర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో ఫోన్ సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. గేమ్స్ ఆడినా, యాప్స్ వాడినా మెరుగైన పని తీరునే పొందవచ్చు.

వెనుకవైపు 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో ఫొటోలు అదిరిపోతాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5000mAh బ్యాటరీతో రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో బ్యాటరీ అయిపోయినా నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు.

CMF ఫోన్ 2 BIS వెబ్‌సైట్‌లో కనిపించడంతో, ఇండియా లాంచ్ ఇక చాలా దగ్గరలోనే అనిపిస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు, అదిరిపోయే కెమెరాలు, పవర్ఫుల్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. నథింగ్ బ్రాండ్ వాల్యూ ఫర్ మనీ ఫోన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తే, CMF ఫోన్ 2 కూడా మిడ్-రేంజ్ మార్కెట్‌లో మరో సంచలనం సృష్టించడం ఖాయం.

మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. అప్పటివరకు వెయిట్ చేయండి. ఈ మొబైల్స్‌కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ కోసం మా గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ తరచూ చెక్ చేస్తూ ఉండండి.

More from GizBot

Best Mobiles in India

English summary
CMF Phone 2, Nothing's budget phone, is launching soon in India after BIS listing. Expected mid-range upgrade with Snapdragon 7s Gen 3, 50MP camera, and 5000mAh battery.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X