Home
Mobile

ఈ ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్‌.. 50MP+ 50MP కెమెరాలు, 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నథింగ్‌ సబ్‌బ్రాండ్‌ ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో CMF ఫోన్‌ 2 ప్రో 5G మోడల్‌ను లాంచ్ చేసింది. సాఫ్ట్‌వేర్‌ పరంగా మెరుగైన అనుభూతి కావాలని భావిస్తున్న వారికి ఈ ఫోన్‌ అత్యంత అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ అనేక ఆకట్టుకొనే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌పై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

CMF ఫోన్‌ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (CMF Phone 2 Pro 5G Smartphone) మే నుంచి సేల్‌ ప్రారంభం అయింది. విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.20,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను పొందవచ్చు.

CMF Phone 2 Pro 5G smartphone pricedrop

ఈ బ్యాంకు కార్డులపై డిస్కౌంట్స్‌ :
CMF ఫోన్‌ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ను ఫ్లిప్‌కార్ట్‌లో ICICI బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డు నాన్ EMI లావాదేవీలపై రూ.2000 పొందవచ్చు. అదే HDFC క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై EMI లావాదేవీ రూపంలో చెల్లింపులు చేస్తే రూ.1000 ను తగ్గింపును పొందవచ్చు.

కలర్‌ వేరియంట్స్‌ :
దీంతోపాటు IDFC బ్యాంకుల EMI చెల్లింపులపై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే ఈ డిస్కౌంట్‌ ఆఫర్ల ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయో వెల్లడి కాలేదు. ఈ సీఎంఎఫ్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్‌, వైట్, లైట్‌ గ్రీన్, ఆరెంజ్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తున్నాయి.

CMF Phone 2 Pro 5G smartphone pricedrop

అమోలెడ్ డిస్‌ప్లే :
CMF ఫోన్‌ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లే ను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 480Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. HDR10+ సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ Panda గ్లాస్‌ పొందుతోంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.2 పైన పనిచేస్తోంది. ఈ CMF ఫోన్‌ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP టెలిఫోటో కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్‌ Truelens ఇంజిన్ 3.0 టెక్నాలజీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

CMF ఫోన్ 2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్, 5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఛార్జర్‌, ఫోన్‌ కేస్‌ను అందిస్తుంది. IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. 5G, 4G, WiFi 6, బ్లూటూత్‌ 5.3, USB-C చార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
CMF Phone 2 Pro 5G smartphone gets rs2000 bank discount on flipkart full specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X