Home
Mobile

50MP టెలిఫోటో లెన్స్‌, FHD+ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్‌, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌ ఫోన్‌పై డిస్కౌంట్‌!

నథింగ్‌ సంస్థ ఇటీవల సుమారు రూ.20 వేల ధర సెగ్మెంట్‌ లో నథింగ్‌ ఫోన్‌ 3a లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ ను తీసుకొచ్చింది. ఈ నెల తొలివారంలోనే సేల్‌ కూడా ప్రారంభం అయింది. అయితే ఈ సంవత్సరం తొలిభాగంలోనే నథింగ్‌ సంస్థ సబ్‌బ్రాండ్‌ CMF నుంచి ఫోన్‌ 2 ప్రో అందుబాటులోకి వచ్చింది. CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ( CMF Phone 2 Pro Smartphone ) ఫుల్‌ HD+ డిస్‌ప్లే, 50MP టెలిఫోటో లెన్స్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను పొందుతుంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ ల వివరాలు.

రూ.1000 డిస్కౌంట్‌ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో CMF ఫోన్‌ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.20,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. దీంతోపాటు UPI లావాదేవీలపైనా రూ.1000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

CMF Phone 2 Pro gets Rs1000 bank discount on flipkart here are the specifications

నాలుగు కలర్‌ వేరియంట్స్‌ :
ఈ సీఎంఎఫ్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్‌, లైట్‌ గ్రీన్‌, ఆరెంజ్‌, వైట్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.77 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 480Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది.

మీడియాటెక్‌ ప్రాసెసర్‌, 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.2 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని సంస్థ తెలిపింది.

టెలిఫోటో లెన్స్‌, ట్రూలెన్స్‌ టెక్నాలజీ :
కెమెరా విభాగం పరంగా Truelens ఇంజిన్ 3.0 టెక్నాలజీని పొందుతోంది. ఈ CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో EIS ( ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ ) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 50MP టెలిఫోటో లెన్స్‌, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చి ఉంది.

ఫాస్ట్‌, రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. దీంతోపాటు 5W రివర్స్‌ ఛార్జింగ్‌ ను కూడా సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్‌ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP54 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
CMF Phone 2 Pro gets Rs1000 bank discount on flipkart here are the specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X