మూడు కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్, ఆకట్టుకొనే డిజైన్‌తో CMF Phone 2 Pro.. రేపే విడుదల
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ నథింగ్ గత నెలలో నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a ప్రో స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. నథింగ్ సబ్‌బ్రాండ్ CMF నుంచి గత సంవత్సరం CMF ఫోన్ 1 విడుదల అయింది. భారత్ మార్కెట్‌లోకి రేపు మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఏప్రిల్ 28 సాయంత్రం 6.30 గంటలకు CMF ఫోన్ 2 ప్రో (CMF Phone 2 Pro Smartphone Launch) విడుదల కానుంది. దీంతోపాటు ఇయర్‌బడ్స్ కూడా లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి.
సీఎంఎఫ్ కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను సంస్థ విడుదల చేసింది. దీని ఆధారంగా గత మోడల్ కంటే అనేక అప్‌గ్రేడ్స్‌ను కలిగి ఉంటుంది. డ్యూయల్ టోన్ బ్యాక్ ప్యానల్ ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఈ ఫోన్ గ్రే, ఆరెంజ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. దీంతోపాటు కెమెరా మాడ్యూల్ లో కీలక మార్పులను గుర్తించవచ్చు. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ డిజైన్‌ను సంస్థ విడుదల చేసింది.

ఈ ఫోన్ చిప్‌సెట్ వివరాలను ఇప్పటికే విడుదల చేసింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్‌తో CMF ఫోన్ 2 ప్రో పనిచేస్తుంది. గత మోడల్ కంటే మెరుగైన పనితీరును అందిస్తుందని పేర్కొంది.
Playful and powerful.
— CMF by Nothing (@cmfbynothing) April 21, 2025
This is CMF Phone 2 Pro. pic.twitter.com/0vHufUxBfM
కెమెరా వివరాలను కూడా సీఎంఎఫ్ సంస్థ విడుదల చేసింది. గత మోడల్ డ్యూయల్ కెమెరాలతో అందుబాటులోకి రాగా.. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో మాత్రం ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరా, 119.5 డిగ్రీ ఫీల్డ్ వ్యూ తో 8MP అల్ట్రా వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ సన్నని డిజైన్‌తోపాటు తక్కువ బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు గేమింగ్ కోసం ప్రత్యేక ఫీటర్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. 120fps, 1000Hz టచ్ రెస్పాన్స్ రేట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు సెగ్మెంట్‌లోనే బ్రైట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ.20,000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్ లో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. రేపు సాయంత్రానికి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
CMF ఫోన్ 1 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 నథింగ్ OS 2.6 పైన పనిచేస్తోంది. 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలతోపాటు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. విడుదల సమయంలో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.15999 గా ఉంది.


Click it and Unblock the Notifications