50MP + 50MP + 8MP కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్‌తో స్మార్ట్‌ఫోన్.. పూర్తి వివరాలు..!
నథింగ్ సబ్‌బ్రాండ్ CMF నుంచి భారత్ మార్కెట్‌లోకి ఏప్రిల్ 28 వ తేదీన CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. గత సంవత్సరం లాంచ్ అయిన సీఎంఎఫ్ ఫోన్ 1 కు తర్వాత తరం వెర్షన్‌గా ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సీఎంఎఫ్ కొత్త ఫోన్ గురించి అనేక స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడవుతున్నాయి. ఫోన్‌తోపాటు బడ్స్ కూడా విడుదల కానున్నాయి. CMF బడ్స్ 2, బడ్స్ 2a, బడ్స్ 2 ప్లస్ ను కూడా లాంచ్ చేస్తుంది.
CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ (CMF Phone 2 Pro Smartphone) గురించి ఇటీవలే బ్యాక్ ప్యానల్ డిజైన్, చిప్‌సెట్ వివరాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్ కెమెరాల వివరాలను సంస్థ విడుదల చేసింది. CMF ఫోన్ 1 హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉండగా.. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో మోడల్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది.

CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 1/1.57 అంగుళాల 50MP ప్రైమరీ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా, 119.5 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. అయితే సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవలే ఈ హ్యాండ్‌సెట్ చిప్‌సెట్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. సీఎంఎఫ్ కొత్త హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గత మోడల్‌తో పోలిస్తే మెరుగైన పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. 10 మెరుగైన CPU, 5 శాతం గ్రాఫిక్స్ పనితీరు మెరుగుపడుతుంది.
ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ డిజైన్ ను సంస్థ ఇప్పటికే టీజ్ చేసింది. మరియు ఈ ఫోన్ తక్కువ బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది. BGMI గేమింగ్ పరంగా 120fps మరియు 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది.
ఇటీవల వచ్చిన లీక్స్ ఆధారంగా CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత NothingOS 3.1 తో పనిచేస్తుందని తెలుస్తోంది.
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌తోపాటు CMF బడ్స్ 2 కూడా విడుదల కానున్నాయి. ఈ బడ్స్ 11mm కస్టమ్ డ్రైవర్స్‌ను కలిగి ఉంటాయి. Dirac Opteo సౌండ్ ట్యూనింగ్, నథింగ్ అల్ట్రా బాస్ టెక్నాలజీ 2.0 ను సపోర్టు చేస్తుంది. ఈ బడ్స్ స్పేషియల్ ఆడియో. డ్యూయల్ కనెక్షన్ సపోర్టును కలిగి ఉంటాయి.
CMF బడ్స్ 2.. క్లియర్ వాయిస్ టెక్నాలజీ 3.0, విండ్ నాయిస్ రిడక్షన్ 3.0 వంటి ఫీచర్‌లతో 6 HD మైక్రోఫోన్స్ కలిగి ఉంటాయి. 5200Hz ఫ్రీక్వెన్సీ రేంజ్‌లో 48dB హైబ్రిడ్ ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్‌ను చేస్తాయి. ఈ బడ్స్‌ను ChatGPT తో ఇంటిగ్రేట్ చేయవచ్చు. వాయిస్ కమాండ్స్ ద్వారా యాక్టివేట్ చేసి, వినియోగించుకోవచ్చు.
సీఎంఎఫ్ బడ్స్ ను సింగిల్ ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 55 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుంది. మరియు 10 నిమిషాల ఛార్జింగ్‌తో 7.5 గంటల ఆడియో ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుంది. ఈ బడ్స్ IP55 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా సీఎంఎఫ్ బడ్స్ 2 లైట్ గ్రీన్, డార్క్ గ్రే, ఆరెంజ్ రంగుల్లో లభించనున్నాయి. మరియు అమెరికాలో $59 (భారత్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.5000) గా ఉంటుందని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications