Home
Mobile

CMF : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ నుంచి ఉహించని ప్రకటన..!

నథింగ్‌ సబ్‌బ్రాండ్ CMF నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుందని ఎప్పటి నుంచో లీక్స్‌ వస్తున్నాయి. ప్రస్తుతం CMF నుంచి ఫోన్ 1 అందుబాటులో ఉంది. ఈ ఫోన్ తర్వాత తరం వెర్షన్‌గా CMF ఫోన్‌ 2 విడుదల కానుందని అంతా భావించారు. అయితే సంస్థ అందరినీ ఆశ్చర్యపరుస్తూ కీలక ప్రకటన చేసింది. CMF ఫోన్‌ 2 ప్రో ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. మరియు విడుదల తేదీని ప్రకటన చేసింది.

CMF ఫోన్‌ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (CMF Phone 2 Pro) ఏప్రిల్‌ 28 సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను లాంచ్ చేసింది. అయితే ఫోన్‌ 2 స్టాండర్డ్‌ వేరియంట్‌ కూడా విడుదల కానుందా లేదా కేవలం ప్రో మోడల్ మాత్రమే లాంచ్‌ కానుందా తెలియాల్సి ఉంది.

CMF Phone 2 Pro smartphone

అయితే ఈ హ్యాండ్‌సెట్ ధర సుమారుగా రూ.20 వేలుగా ఉండే అవకాశం ఉంది. ఈ CMF స్మార్ట్‌ఫోన్‌తోపాటు బడ్స్‌ 2, బడ్స్‌ 2a లేదా బడ్స్‌ 2 ప్లస్‌ ఇయర్‌బడ్స్‌ కూడా లాంచ్ చేయనున్నట్లు సంస్థ తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ద్వారా వెల్లడించింది.

CMF ఫోన్‌ 2 ప్రో హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. గత మోడల్‌తో పోలిస్తే కొత్త ఫోన్‌ డిజైన్ పరంగా చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ బ్యాక్‌ ప్యానల్‌ ప్లాస్టిక్‌ ఎడ్జ్‌లతో కూడిన మ్యాటీ ఫినిష్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

CMF నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్న CMF ఫోన్ 1 విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ప్రారంభ ధర రూ.15,999 గా ఉంది. 6.67 అంగుళాల డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చి ఉంది.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 14 నథింగ్‌ OS 2.6 పైన పనిచేస్తోంది. మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

నథింగ్‌ నుంచి ఇటీవలే ఫోన్‌ 3a సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఫోన్‌ 3a, ఫోన్‌ 3a ప్రో ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. సేల్‌ కూడా ప్రారంభం అయింది. నథింగ్‌ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.24,999 గా ఉంది. ప్రో మోడల్‌ ప్రారంభ ధర రూ.29,999 గా ఉంది.

* నథింగ్‌ ఫోన్‌ 3a స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత NothingOS 3.1 తో పనిచేస్తుంది. 50MP + 50MP + 8MP కెమెరాలతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

నథింగ్‌ ఫోన్ 3a ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm ఆక్టాకోర్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత NothingOS 3.1 తో పనిచేస్తోంది. 50MP + 50MP + 8MP కెమెరాలతోపాటు 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
CMF Phone 2 Pro smartphone launch date revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X