CMF Phone 2 Pro : 50MP + 50MP కెమెరాలు, 5000mAh బ్యాటరీ, 6.77 అంగుళాల డిస్‌ప్లేతో 5G ఫోన్ విడుదల
నథింగ్ సబ్‌బ్రాండ్ CMF నుంచి ఇవాళ భారత్ మార్కెట్‌లోకి సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో (CMF Phone 2 Pro) స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. స్మార్ట్‌ఫోన్‌తోపాటు బడ్స్‌ను కూడా సంస్థ లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం నాలుగు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తోపాటు CMF బడ్స్‌ను కూడా లాంచ్ చేసింది.
CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల ఫుల్ HD+ (1080x2392 పిక్సల్స్) అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160Hz PWM ఫ్రీక్వెన్సీ, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, 387ppi డెన్సిటీను కలిగి ఉంది.

ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టు చేస్తుంది. panda గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్, ఆరెంజ్, వైట్ రంగుల్లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.
చిప్‌సెట్, OS వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ర్యామ్ బూస్టర్ ఫీచర్ ద్వారా గరిష్ఠంగా 16GB వరకు ర్యామ్‌ను పొడిగించవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.2 పైన పనిచేస్తుంది.
రెండు స్టోరేజీ వేరియంట్‌లు :
ఈ చిప్‌సెట్ గత సంవత్సరం లాంచ్ అయిన CMF ఫోన్ 1 కంటే 10 శాతం ఫాస్టర్ CPU, 5 శాతం మెరుగైన గ్రాఫిక్స్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ 8GB + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్ అయింది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
ట్రిపుల్ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.88 అపేచర్, EIS, 1/1.57 అంగుళాల 50MP ప్రైమరీ కెమెరా, f/1.88 అపేచర్‌తో 50MP టెలిఫోటో కెమెరా మరియు f/2.2 అపేచర్, 119.5 డిగ్రీ ఫీల్డ్‌వ్యూతో 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది.
సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ F/2.45 అపేచర్‌తో 16MP కెమెరాను అమర్చారు. మెరుగైన కెమెరా అనుభూతి కోసం ఈ స్మార్ట్‌ఫోన్ నథింగ్ కు చెందిన Truelens ఇంజిన్ 3.0 టెక్నాలజీ ను ఉపయోగించుకుంది.
రివర్స్ ఛార్జింగ్ సపోర్టు :
ఈ స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 47 గంటల వరకు కాల్స్ మాట్లాడుకోవచ్చు. 22 గంటల యూట్యూబ్ స్ట్రీమింగ్ కోసం వినియోగించుకోవచ్చు.

ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం :
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది. రిటైల్ బాక్స్‌లో కేస్, ఛార్జర్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. ఇవాళ్టి నుంచే ఈ ఫోన్‌ను ప్రీ ఆర్డర్ (ముందస్తు బుకింగ్) చేసుకొనేందుకు అవకాశం ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మే 5 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. CMF ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా సేల్ ప్రారంభం కానుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్ తోపాటు యూనివర్సల్ కవర్, లెన్స్ వంటిని కూడా అందించనున్నారు.
కనెక్టివిటీ పరంగా సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 5G, బ్లూటూత్ 5.3, వైఫై 6, USB-C వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.


Click it and Unblock the Notifications








