CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు లీక్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!
నథింగ్ సంస్థ సబ్‌బ్రాండ్ CMF భారత్ మార్కెట్‌లో ఏప్రిల్ 28 వ తేదీన స్మార్ట్‌ఫోన్‌తోపాటు బడ్స్‌ను విడుదల చేయనుంది. ఇప్పటికే సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో (CMF Phone 2 Pro Smartphone), బడ్స్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. డిజైన్, కెమెరా, చిప్‌సెట్ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా ఈ ఫోన్ ధర వివరాలు లీక్ అయ్యాయి.
ధర వివరాలు :
ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ఈ ఫోన్ ధర వివరాలను లీక్ చేశారు. దీని ఆధారంగా CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.20999 గా ఉంటుందని తెలిపారు. బ్యాంకు ఆఫర్లతో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.17999 గా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.

అయితే తర్వాత టిప్‌స్టర్ ఈ వివరాలతో కూడిన సోషల్ మీడియా పోస్ట్‌ను డీలిట్ చేశారు. అయితే గతంలో వచ్చిన వివరాలు ఆధారంగా ఈ CMF ఫోన్ రూ.20000 కంటే తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వచ్చిన వివరాలు ఆధారంగా ఈ ఫోన్ నాలుగు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
చిప్‌సెట్ వివరాలు :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది ఈ ఫోన్ Nothing OS 3.1 ను కలిగి ఉంటుంది. మరియు 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. BGMI గేమింగ్ పరంగా 120fps మరియు 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది.
ట్రిపుల్ కెమెరా :
ఇటీవలే CMF సంస్థ వెల్లడించిన వివరాల ఆధారంగా ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 1/1.57 అంగుళాల 50MP ప్రైమరీ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా, 119.5 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.
బ్యాటరీ వివరాలు లీక్ :
దీంతోపాటు గతంలోనే ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ డిజైన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ప్లాస్టిక్ మెటీరియల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది.
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ఏప్రిల్ 28 సాయంత్రం 6:30 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన ధర వివరాలపై సంస్థ ఎటువంటి స్పందన తెలియజేయలేదు.
CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌తోపాటు బడ్స్ కూడా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో CMF బడ్స్ 2, బడ్స్ 2a, బడ్స్ 2 ప్లస్ ను కూడా లాంచ్ చేస్తుంది. ఇప్పటికే బడ్స్‌కు సంబంధించిన వివరాలు కూడా వెల్లడయ్యాయి.


Click it and Unblock the Notifications








