50MP + 50MP కెమెరాలు, 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ 5G ఫోన్.. రేపటి నుంచే సేల్..!
CMF సంస్థ తన రెండో స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఏప్రిల్ 28 న విడుదల చేసింది. దీంతోపాటు ఇయర్‌బడ్స్‌ను కూడా లాంచ్ చేసింది. CMF ఫోన్ 2 ప్రో బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ రేపటి నుంచి భారత్ లో సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ రెండు 50MP కెమెరాలతోపాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. నాలుగు కలర్ వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో (CMF Phone 2 Pro Sale) ఏప్రిల్ 28 నుంచే ముందస్తు బుకింగ్‌లకు అవకాశం కల్పించింది. రేపటి (మే 5 వ తేదీ) నుంచి CMF ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా ప్లాట్‌ఫాంల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఛార్జర్, ఫోన్ కేస్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది.

CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.17999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, వైట్, లైట్ గ్రీన్, ఆరెంజ్ రంగుల్లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.
CMF ఫోన్ 2 ప్రో హ్యాండ్‌సెట్ డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది. నాలుగు కలర్ వేరియంట్స్ ఆకట్టుకుంటాయి. ఈ ఫోన్ కొనుగోలుతో ఛార్జర్, ఫోన్ కేస్‌తోపాటు అనేక ఉత్పత్తులను అదనంగా పొందవచ్చు. ఈ ఫోన్ స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది.
సీఎంఎఫ్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM ఫ్రీక్వెన్సీ, 387ppi డెన్సిటీని కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టు చేస్తుంది. మరియు Panda గ్లాస్ రక్షణను కలిగి ఉంది.
ఈ CMF స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.2 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
నథింగ్ సబ్‌బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను అమర్చారు. f/1.88 అపేచర్, 1/1.57 అంగుళాల 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ను సపోర్టును కలిగి ఉంది. 50MP టెలిఫోటో కెమెరా, 119.5 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను అమర్చారు. మరియు 16MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. Truelens ఇంజిన్ 3.0 టెక్నాలజీ ను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. 5G, 4G, WiFi 6, బ్లూటూత్ 5.3, USB-C వంటి కనెక్టివిటీ ఫీచర్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








