Home
Mobile

CMF Phone 2 Pro Vs Nothing Phone 3a ఈ రెండు ఫోన్‌లతో ఏది బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి వివరాలు..!

నథింగ్‌ సంస్థ గత నెలలో నథింగ్‌ ఫోన్ 2a ఫోన్‌ ను లాంచ్ చేసింది. తాజాగా నథింగ్‌ సబ్‌బ్రాండ్ CMF నుంచి CMF ఫోన్‌ 2 ప్రో మోడల్‌ విడుదల అయింది. మిగిలిన స్మార్ట్‌ఫోన్‌లతో పోల్చుకుంటే ఈ రెండు మోడల్స్ ప్రత్యేక డిజైన్‌ను కలిగి ఉంటాయి. అయితే నథింగ్‌ ఫోన్ 3a ప్రారంభ ధర రూ.24999 గా ఉండగా.. సీఎంఎఫ్‌ కొత్త ఫోన్ ప్రారంభ ధర రూ.18999 గా ఉంది. ఈ రెండింటిలో ఏ ఫోన్‌ (CMF Phone 2 Pro Vs Nothing Phone 3a) ఎలాంటి స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లను కలిగి ఉందో తెలుసుకుందాం.

డిస్‌ప్లే వివరాలు :
CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 2160Hz PWM ఫ్రీక్వెన్సీ, 480Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 387ppi డెన్సిటీను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టు చేస్తుంది. panda గ్లాస్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

CMF Phone 2 Pro Vs Nothing Phone 3a

నథింగ్‌ ఫోన్‌ 3a స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ గరిష్ఠ, 1000Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 2160Hz PWM బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Panda గ్లాస్‌ రక్షణను పొందుతుంది.

ఈ రెండు ఫోన్‌లు కూడా 6.77 అంగుళాల ఫుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. మరియు ఒకే రకమైన బ్రైట్‌నెస్‌, రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉన్నాయి. మరియు ఒకే రకమైన ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

చిప్‌సెట్, OS వివరాలు :
CMF ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.2 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. మైక్రో మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

నథింగ్‌ ఫోన్‌ 3a స్మార్ట్‌ఫోన్‌ 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్టంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత NothingOS 3.1 పైన పనిచేస్తుంది. ఈ నథింగ్‌ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తామని నథింగ్‌ తెలిపింది.

ఈ రెండు చిప్‌సెట్‌ కూడా ఈ సెగ్మెంట్స్‌లో మెరుగైన పనితీరును కనబరుస్తాయి. అయితే సందర్భాలను సారంగా ఈ రెండు ఫోన్‌ల చిప్‌సెట్స్‌ మధ్య కొన్ని తేడాలు ఉండే అవకాశం ఉంది.

కెమెరా వివరాలు :
CMF స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.88 అపేచర్‌, 1/1.57 అంగుళాల 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా EIS ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ను సపోర్టు చేస్తుంది. f/1.88 అపేచర్‌తో 50MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది.

దీంతోపాటు f/2.2 అపేచర్‌న, 119.5 డిగ్రీల ఫీల్డ్‌ వ్యూతో 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం f/2.45 అపేచర్‌తో 16MP ను కలిగి ఉంది. ఈ సీఎంఎఫ్‌ ఫోన్‌ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ Truelens ఇంజిన్‌ 3.0 టెక్నాలజీ ను వినియోగిస్తోంది.

నథింగ్ ఫోన్‌ వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంటుంది. OIS, EIS, f/1.88 అపేచర్‌ తో 50MP శాంసంగ్‌ 1/1.57 అంగుళాల కెమెరా, f/2.0 అపేచర్‌, EIS, 2x ఆప్టికల్‌, 30x డిజిటల్ జూమ్‌తో 50MP సోనీ కెమెరా మరియు 8MP సోనీ అల్ట్రావైడ్‌ కెమెరాను అమర్చారు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ 32MP కెమెరాను అమర్చారు.

కెమెరా విభాగం పరంగా నథింగ్ ఫోన్‌ కెమెరాలు ఆకట్టుకొనే ఫోటోలను క్యాప్చర్‌ చేస్తాయి. దీంతోపాటు CMF ఫోన్ 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండగా.. నథింగ్‌ ఫోన్‌ 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

బ్యాటరీ పనితీరు :
సీఎంఎఫ్‌ స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్, 5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ తో పనిచేస్తుంది. అదే నథింగ్‌ ఫోన్‌ 50W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‌లు ఒకే రకమైన బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే నథింగ్‌ ఫోన్ మెరుగైన ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.

ధర, సేల్‌ వివరాలు :
CMF ఫోన్‌ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.20,999 గా ఉంది. ప్రస్తుతం ప్రీ ఆర్డర్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. అయితే సేల్‌ మే 5 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

నథింగ్‌ ఫోన్‌ 3a 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999 గా ఉంది. ఈ ఫోన్‌ ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్‌లు వేర్వేరు ధరలను కలిగి ఉన్నాయి. అయితే ఆయా సెగ్మెంట్స్‌లో బెస్ట్ హ్యాండ్‌సెట్‌గా ఉన్నాయి.

ఈ రెండు ఫోన్‌ డిస్‌ప్లే, బ్యాటరీల పరంగా ఒకే రకమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. మరియు రెండు చొప్పున 50MP కెమెరాలను కలిగి ఉన్నాయి. అయితే సెల్ఫీ కెమెరా విషయంలో నథింగ్‌ ఫోన్‌ మెరుగ్గా ఉంది. అయితే రూ.20 వేల ధరలో కొనుగోలు చేయాలని భావిస్తే CMF, అదే రూ.25 వేల ధరలో కొనుగోలు చేయాలని భావిస్తే నథింగ్‌ వైపు మొగ్గు చూపవచ్చు.

Best Mobiles in India

English summary
CMF Phone 2 Pro Vs Nothing Phone 3a which is the best phone here are the full features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X