CMF ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. ఎప్పుడు విడుదల కానుంది?.. ధర వివరాలు..!
నథింగ్ స్మార్ట్‌ఫోన్ సబ్‌బ్రాండ్ CMF నుంచి గతంలో స్మార్ట్‌ఫోన్‌తోపాటు ఇతర గ్యాడ్జెట్‌లు విడుదల అయ్యాయి. బడ్జెట్ రేంజ్‌లో CMF ఫోన్ 1 విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ సహా ఫీచర్‌లో ఆకట్టుకుంది. అయితే త్వరలో CMF ఫోన్ 2 లాంచ్ కానుంది. గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.
ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా CMF ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ (CMF Phone 2 Smartphone) 6.3 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 2500 నిట్స్ బ్రైట్‌నెస్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది. డిజైన్ పరంగా హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుందని సమాచారం. CMF ఫోన్ 2 హ్యాండ్‌సెట్ సిగ్నెచర్ డిజైన్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ మ్యాటీ ఫినిష్‌ను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత NothingOS 3.1 పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని సమాచారం. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ మరియు 2MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.
ఈ CMF స్మార్ట్‌ఫోన్ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఫోన్ అంచనా ధర వివరాలు :
CMF ఫోన్ 2 హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉంటుందని తెలుస్తోంది. ధరపై ఈ సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.
CMF బ్రాండ్ నుంచి ఫోన్ 2, CMF వాచ్ 3 ప్రో, CMF నెక్‌బ్యాండ్ ప్రో 2, CMF బడ్స్ ప్రో 3 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే సీఎంఎఫ్ ఫోన్ 2 ఏప్రిల్ నెలలో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే సంస్థ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
* CMF ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాతో అందుబాటులో ఉంది. మరియు ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 నథింగ్ OS 2.6 పైన పనిచేస్తోంది. విడుదల సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14999 కు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








