Home
Mobile

ColorOS 16 : OPPO Find X9 సిరీస్‌ను మరింత ఆకట్టుకొనేలా చేసే సాఫ్ట్‌వేర్‌ లేయర్‌

గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్‌ఫోన్‌ హార్డ్‌వేర్‌ అతివేగంగా అభివృద్ధి చెంచింది. అయితే హార్డ్‌వేర్‌ అనుభూతి చెంది విధానం ఆ డివైజ్‌ పనిచేసే సాఫ్ట్‌వేర్‌ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఫ్లాగ్‌షిప్‌ కెమెరా త్వరగా యాక్సెస్‌ రావడం, అదే విధంగా UI రోజువారీ ఉపయోగంలో శక్తి సజావుగా అందించలేకపోతే శక్తివంతమైన ప్రాసెసర్‌ కూడా సాధారణమైనది అనిపించవచ్చు.

OPPO Find X9 సిరీస్‌ హార్డ్‌వేర్‌ పరంగా అనేక మెరుగైనదిగా ఉంది. అయితే అంతే ఆసక్తికరమైన అంశాలు ColorOS 16 లో ఉన్నాయి. ఇది ఫోన్‌ రోజువారీ ఉపయోగంలో ఎలా ప్రవర్తిస్తుందో తెలిపే నిర్ణయించే సాఫ్ట్‌వేర్‌ లేయర్‌. అయితే OPPO దాని ఇంటర్‌ఫేస్‌ను పూర్తిగా మార్చేందుకు ప్రయత్నం చేయలేదు. బదులుగా చిన్న, పునరావృత పరస్పర చర్యలను మెరుగుపరచడంపై దృష్టిపెట్టింది. ఇవే కాలక్రమేణా ఫోన్ ఎలా ఉంటుందో నిర్ణయిస్తాయి.

coloros 16 the software layer that brings the oppo find x9 series together

ఏఐ మైండ్‌ స్పేస్‌
చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు స్క్రీన్‌షాట్‌ క్లట్టర్‌ ఎదుర్కొంటుంటారు. డెలివరీ సమాచారం, అడ్రస్‌, షెడ్యూల్‌, ఇతరల అంశాలకు సంబంధించిన సమాచారానికి సంబంధించిన అనేక ఫోటోలు గ్యాలరీలో పేరుకుపోతాయి. ColorOS 16 లో తీసుకొచ్చి ఏఐ మైండ్ స్పేస్‌ ఈ సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తుంది.

ఏదైనా సమాచారం కోసం మీరు స్క్రీన్‌షాట్‌ తీసుకున్నప్పుడు, ఈ కొత్తగా వచ్చిన సిస్టమ్‌ అందులోకి అడ్రస్‌, తేదీ సహా ఇతర కీలక వివరాలను సేకరిస్తుంది. ఏఐ మైండ్‌ స్పేస్ ఈ వివరాలను సేకరించి మ్యాప్స్‌, క్యాలెండర్‌, నోట్స్‌కు అందుబాటులోకి తీసుకొస్తుంది. కేవలం స్క్రీన్‌షాట్‌లుగా మిగిలిపోకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు.

coloros 16 the software layer that brings the oppo find x9 series together

కొంతమందికి ఇదో చిన్న విషయంగా అనిపించినా, క్రమంగా ఇది ఉపయోగపడుతుంది. మరియు స్క్రీన్‌షాట్‌లతో ఫోన్‌ గ్యాలరీ నిండిపోకుండా కట్టడి చేస్తుంది.

స్నాప్‌ కీ ప్రత్యేకతలు
అనేక డివైజ్‌లలో ఫిజికల్ బటన్లు చాలా సంవత్సరాలుగా ఉన్నాయి. అయితే OPPO తీసుకొచ్చిన స్నాప్‌ కీ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. యూజర్లు సింగిల్‌ ప్రెస్‌, డబుల్‌ ప్రెస్‌ లేదా లాంగ్‌ ప్రెస్‌ తో అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

సులభంగా కెమెరాను ఆన్‌ చేయడం, మీటింగ్‌ సమయాల్లో వాయిస్‌ రికార్డింగ్‌ కోసం మెనూ అంతా వెతకాల్సిన అవసరం ఉండదు. చిన్న గెశ్చర్‌తో ఆన్‌ డివైజ్ ట్రాన్స్‌లేషన్‌ను యాక్టివేట్‌ చేయడం, స్క్రీన్‌పైన ఉన్న టెక్ట్స్‌ను హైలెట్‌ చేయడం వంటి పనులను సులభంగా చేయవచ్చు. ఇలాంటి పనుల కోసం ఈ కీ పై ఆధారపడేలా చేస్తుంది.

మూడు వేర్వేరు ఇన్‌పుట్‌ లను అందించడం ద్వారా OPPO బటన్‌ బహుముఖంగా, అంతరాయం లేకుండా పనిచేస్తుంది. అయితే ఈ కీ ఏదో జిమ్మిక్కు మాదిరిగా కాకుండా ఆలోచనాత్మకంగా పనిచేస్తుంది.

హార్డ్‌వేర్‌కు అనుగుణంగా ఉండే కెమెరా ఇంటర్‌ఫేస్‌
Find X9 సిరీస్‌ ఇమేజింగ్‌ ఫీచర్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అయితే వేగవంతమైన, వేగంగా ప్రతిస్పందించే ఇంటర్‌ఫేస్‌ సపోర్టు ఉంటేనే ఈ కెమెరాలు ఉపయోగపడతాయి. ColorOS 16లో కెమెరా యాప్‌ డిజైన్‌లో మార్పులు చేయలేదు గానీ ఇంటర్‌ఫేస్‌ వేగం, స్థిరత్వా్నికి సంబంధించిన అప్‌గ్రేడ్స్‌ ఉన్నాయి.

coloros 16 the software layer that brings the oppo find x9 series together

ఫోటో నుంచి వీడియో మోడ్‌కు మారినా, లేదా వివిధ మోడ్స్‌ మధ్య పరస్పరం మారినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే సెట్టింగ్స్‌లో మార్పులు చేసినా సౌకర్యంగానే ఉంటుంది. తక్కువ కాంతి మరియు ప్రివ్వ్యూ సమయాల్లోనూ స్థిరంగానే ఉంటుంది. మరియు ల్యాగ్‌ లేకుండా చూస్తాయి.

కెమెరా విభాగం, అవసరానికి తగినట్లు పనిచేసే UI.. కచ్చితంగా ఆకట్టుకుంటాయి.

ఆక్వా డైనమిక్స్, లాక్‌ స్క్రీన్‌
వివిధ అప్‌డేట్స్‌కు సంబంధించి నోటిఫికేషన్‌లు ప్రధాన ప్రాథమిక మార్గంగా ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ఈ నోటిఫికేషన్‌లు ఉపయోగపడడానికి బదులుగా ఇబ్బంది కరంగా ఉంటాయి. ఆక్వా డైనమిక్స్‌ తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈ ఫీచర్‌తో లాక్‌ స్క్రీన్‌ వైపు అవసరం అయిన నోటిఫికేషన్‌లను మాత్రమే ఉండేలా చూస్తుంది.

coloros 16 the software layer that brings the oppo find x9 series together

స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్‌ చేయకుండానే.. నేవిగేషన్ అయినా, ఫుల్‌ డెలివరీ అయినా లేదా మ్యూజిక్ సహా ఇతర సమాచారం సులభంగా కనిపించేలా చేస్తుంది. ఈ ఇంటర్‌ఫేస్‌ సౌకర్యవంతంగా, యూజర్లకు అనుకూలంగా ఉంటుంది.

ఫోన్‌ను తరచూ గమనించకపోయినా, అవసరం అయిన నోటిఫికేషన్‌లు మాత్రమే కనిపించేలా ఈ ఫీచర్‌ యూజర్లకు ఉపయోగపడుతుంది. పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుంది.

ఫోన్‌, PC మధ్య అంతరాయాన్ని తగ్గించడం
రోజంతా ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌తో పనిచేసే యూజర్లకు క్రాస్‌ డివైజ్‌ ఫక్షనాలిటి ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ColorOS 16 బహుళ పరికర సాధనాలను మరింత మెరుగుపరుస్తుంది.

Find X9 డివైజ్‌ తన స్క్రీన్‌ను విండోస్‌ లేదా మ్యాక్‌ కు అనుసంధానం చేయగలదు. ఫలితంగా డెస్క్‌టాప్‌ వర్క్‌లోడ్ తోపాటు ఐదు మొబైల్‌ యాప్‌లను ఉపయోగించుకోవచ్చు. మీటింగ్స్‌, ఆన్‌లైన్ తరగతుల సమయాల్లోనూ వినియోగపడుతుంది. ఈ అవసరాల కోసం మొబైల్‌ యాప్‌లను ఉపయోగించకుండా సమయాన్ని ఆదాచేసుకోవచ్చు.

coloros 16 the software layer that brings the oppo find x9 series together

PC, స్మార్ట్‌ఫోన్‌ మధ్య డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ విధానంలో ఫైల్‌ షేరింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. విద్యా్ర్థుల అసైన్‌మెంట్స్‌, ఉద్యోగుల, ఇతర వృత్తుల నిపుణుల డాక్యుమెంట్స్‌ను ఎటువంటి కేబుల్స్‌ సహా ఇతర పరికరాల అవసరం లేకుండానే షేర్ చేయవచ్చు. దీంతోపాటు ఈ ఒప్పో ఫోన్‌ నుంచి PC ను రిమోట్‌గా యాక్సెస్‌ చేసే అవకాశం కూడా ఉంది. ఇంట్లో ఉన్న PC లో ఏదైనా డాక్యుమెంట్‌ ఓపెన్‌ చేసి ఉందని మీకు గుర్తొచ్చినప్పుడు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.

ఈ ఫీచర్లు ఏవి కూడా విప్లవాత్మకమైనవి కావు, కానీ ఫోన్‌ను ఏదో చిన్న పరికరం మాదిరిగా కాకుండా.. కంప్యూటింగ్‌ సెటప్‌లో భాగంగా మారుస్తాయి.

దీర్ఘకాలిక స్థిరత్వం
సాధారణంగా కొత్త ఫోన్‌లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావు. అదే స్థాయి పనితీరును ఎక్కువకాలం కొనసాగించడంలోనే అసలు సామర్థ్యం తెలుస్తుంది. ColorOS 16 లో లూమినస్‌ రెండరింగ్‌ ఇంజిన్, సీమ్‌లెస్‌ యూనిమేషన్‌, ట్రినిటీ ఇంజిన్‌ వంటివి ఉన్నాయి. ఇవి నేవిగేషన్ స్మూత్‌గా మరియు సామర్థ్యం సమంగా షేర్‌ చేసేందుకు వీలుగా పనిచేస్తాయి.

coloros 16 the software layer that brings the oppo find x9 series together

రోజువారీ వినియోగంలో ఈ మెరుగుదల కారణంగా స్థిరమైన స్క్రోలింగ్‌, ఫ్రేమ్‌ డ్రాప్‌లు తగ్గడం, సక్రమమైన యాప్‌ లాంచ్‌లు ఉంటాయి. హోమ్‌స్క్రీన్‌, విడ్జెట్‌, యానిమేషన్‌, లేఅవుట్‌లో మార్పులు మెరుగ్గా నిర్వహిస్తాయి.

దీర్ఘకాలిగ వినియోగంతోనే ఈ సిస్టమ్‌లు ఎలా పనిచేస్తాయో తెలుస్తుంది. ColorOS 16 మాత్రమే దీర్ఘకాల వినియోగంలోనూ ఆకట్టుకొనే పనితీరును కనబరుస్తుంది. ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లు ఎక్కువ కాలం స్థిరంగా ఉండడం ఈరోజుల్లో కీలకమైన అంశంగా ఉంది.

మెరుగైన బ్యాటరీ లైఫ్‌ కోసం ఛార్జింగ్‌ ఇంటెలిజెన్స్
ఈ ఫోన్‌ 7000mAh బ్యాటరీలను కలిగి ఉంది. వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. సాధారణంగా ఫాస్ట్ ఛార్జింగ్‌ అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ColorOS 16 ఈ పరిస్థితులను సక్రమంగా నిర్వహిస్తుంది. ఛార్జింగ్‌ను సర్బుబాటు చేసి సమస్యలను పరిష్కారం చేస్తుంది.

రాత్రి సమయాల్లో ఛార్జింగ్‌ చేస్తున్నట్లు బ్యాటరీ 100 శాతం వద్ద ఎక్కవ సమయం ఉండకుండా చూస్తుంది. అదే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్‌ సమయంలో ఫోన్‌ వేడెక్కకుండా నియంత్రిస్తుంది. ఇవన్నీ బ్యాగ్రౌండ్‌లో నిశ్శబ్దంగా జరుగుతాయి. యూజర్లు తమ అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు.

coloros 16 the software layer that brings the oppo find x9 series together

ఛార్జింగ్‌ వేగం పెరుగుతున్న సమయంలో బ్యాటరీ నిర్వహణ కూడా చాలా ముఖ్యం. ఈ పరిస్థితిని ColorOS 16 అత్యంత మెరుగ్గా నిర్వహిస్తుంది.

రోజువారీ ఉపయోగంలో
colorOS 16 లో అనేక సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. అనుమానాస్పద వినియోగం, SIM తొలగింపు వంటివి గుర్తించబడితే ఫోన్‌ ఆటోమేటిగా సురక్షితంగా ఉండేలా చూస్తుంది. రిమోట్‌ లాక్‌ సామర్థ్యాలు.. మరో ప్రాంతం నుంచి కూడా డివైజ్‌ను స్తంబింపజేసేందుకు అనుమతిస్తాయి. ఆన్‌ డివైస్‌ AI ప్రాసెసింగ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా సురక్షితంగా ఉండేలా చూస్తుంది.

OPPO వెహికల్‌ మోషన్ అలర్ట్‌ను కూడా తీసుకొచ్‌చింది. ఇది ఫోన్‌ను పార్కింగ్‌ చేసి కారులో ఉంచినప్పుడు, ఆకస్మిక కదలికలను గురించేందుకు సెన్సార్‌లను ఉపయోగిస్తుంది. రద్దీగా ఉండే నగర వాతావరణాల్లో ఈ ఫీచర్‌ ఉపయోగపడే అవకాశం ఉంది.

coloros 16 the software layer that brings the oppo find x9 series together

ఆచరణకు అనుకులంగా ఉండే సాఫ్ట్‌వేర్‌
ColorOs 16 పెద్దగా డిజైన్ మార్పులపై దృష్టిపెట్టలేదు. ఇందుకు బదులుగా నెలలు, సంవత్సరాల పాటు Find X9 వినియోగాన్ని మెరుగుపరిచే ఆచ్మరణాతక ఫీచర్‌లపైనే దృష్టిపెట్టింది. సమాచారాన్ని మరింత సక్రమంగా నిర్వహించడం, షార్ట్‌కట్‌ను మరింత సరళీకృతం చేయడం, క్రాస్‌ డివైజ్‌ వర్క్‌ఫ్లోను మెరుగుపరచడం వంటి దీర్ఘకాలిక అంశాలపైన దృష్టిపెట్టింది.

కాస్మెటిక్‌ మార్పుల కంటే స్థిరత్వం, ఆలోచనాత్మక ఫీచర్‌లకు విలువనిచ్చే యూజర్ల కోసం ColorOS 16 మెరుగ్గా పనిచేస్తుంది. ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ను పూర్తిగా ఆస్వాదించడంలో సహాయపడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
coloros 16 the software layer that brings the oppo find x9 series together
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X