బడ్జెట్ ధరలో మరో రెండు 4జీ స్మార్ట్‌ఫోన్లు, జియో ఆఫర్లతో..

Written By:

చైనా మొబైల్ దిగ్గజం క్రోమియో సరికొత్తగా రెండు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. అత్యంత తక్కువ బడ్జెట్ ధరలో ఈ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. కోమియో ఎస్1 లైట్‌, కోమియో సీ2 లైట్‌ పేర్లతో వచ్చిన ఈ మొబైల్ ధరలు వరుసగా రూ.7,499, రూ.5,999గా ఉన్నాయి. కాగా ఈ ఫోన్లపై జియో క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. కాగా గతేడాది విడుదల చేసని కోమియా ఫోన్లను మరికొన్ని ఫీచర్లను జోడించి ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. కెమెరా అలాగే బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

అత్యంత తక్కువ ధరకే అంతర్జాతీయ విమాన టికెట్లు బుక్ చేయాలనుకుంటున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కోమియో సీ2 లైట్ ఫీచర్లు

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3900 ఎంఏహెచ్ బ్యాటరీ.

కోమియో ఎస్1 లైట్ ఫీచర్లు

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

రూ. 2200 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్

కాగా కంపెనీతో భాగస్వామ్యం కుదర్చుకున్న జియో ఈ ఫోన్ల కొనుగోలుపై రూ. 2200 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిచనుంది. అయితే ఫోన్ కొన్న యూజర్లు రూ. 198, రూ.299 ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

నెల నెలా 50 రూపాయల ఓచర్

రీ ఛార్జ్ చేసుకుంటే మీకు నెల నెలా 50 రూపాయల ఓచర్ లభిస్తుంది. దీన్ని మీరు తరువాత రీఛార్జ్ కోసం వాడుకోవచ్చు. ఇలా మీరు 44 నెలల పాటు ప్రతి నెలా రూ.50 ఓచర్ పొందవచ్చు. ఈ ఓచర్ మీకు మైజియో యాప్ లో మీకు కనిపిస్తుంది. దాన్నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

BookMyShow, MakemyTrip యాప్ లు

ఈ రెండు ఫోన్లలో BookMyShow, MakemyTrip యాప్ లు నిక్షిప్తమై ఉంటాయి. ఫోన్ తో పాటే ఇవి మీకు ఇన్ స్టాల్ అయి ఉంటాయి. అలాగే 22 భాషలను ఈఫోన్లు సపోర్ట్ చేసే విధంగా రూపొందించారు. Sunrise Gold, Royal Black and Metallic Grey కలర్స్ లో ఈ ఫోన్లు మీకు లభిస్తాయి.

కోమియో సీ2

కాగా గతేడాది కోమియో సీ2'ను కంపెనీ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీని ధరను రూ.7,199గా నిర్ణయించింది.
కోమియో సీ2 ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

కోమియో పీ1

దీని ధర. రూ.9,999
కోమియో పీ1 ఫీచ‌ర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌
3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌
13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
డ్యుయ‌ల్ సిమ్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Comio launches its new S1 lite and C2 lite smartphones More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot