ఇండియాలోకి మరో చైనా బ్రాండ్ Comio

వస్తువస్తూనే మూడు ఫోన్‌లు మార్కెట్లోకి...

|

లెనోవో, షియోమీ, ఒప్పో, వివో తరహాలో మరో కామియో (Comio) చైనా బ్రాండ్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ బ్రాండ్ వస్తువస్తూనే మూడు ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కామియో ఎస్1, కామియో పీ1, కామియో సీ1 మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి ఎస్1 మోడల్ ధర రూ.9,999. పీ1 మోడల్ ధర రూ.8,999. సీ1 మోడల్ ధర రూ.5.999. ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్‌లు లభ్యమవుతాయి.

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ఇక మరింత సులభతరం!మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ఇక మరింత సులభతరం!

లాంచ్ ఆఫర్స్ ఇవే...

లాంచ్ ఆఫర్స్ ఇవే...

లాంచ్ ఆఫర్స్ క్రింద ఈ ఫోన్ కొనుగోలు పై జియో యూజర్లకు రూ.309 అంతకన్నాఎక్కువ రీఛార్జ్ పై 5జీబి డేటా వోచర్ అదనంగా లభిస్తుంది. ఈ ఫోన్‌లను మీ పాత స్మార్ట్‌ఫోన్‌లతో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌ల పై వన్-టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ వారంటీతో పాటు 465 రోజుల తయారీదారు వారంటీ అందుబాటులో ఉంటుంది. స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ వారంటీ అనేది 6నెలలలోపే వర్తిస్తుంది.

కామియో పీ1 స్పెసిఫికేషన్స్..

కామియో పీ1 స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3GHz 64 బిట్ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 4జీ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

కామియో ఎస్1 స్పెసిఫికేషన్స్..

కామియో ఎస్1 స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3GHz 64 బిట్ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2700mAh బ్యాటరీ, 4జీ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

కామియో సీ1 స్పెసిఫికేషన్స్..

కామియో సీ1 స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3GHz 64 బిట్ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2700mAh బ్యాటరీ, 4జీ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

Best Mobiles in India

English summary
Comio makes its Indian debut, launches three smartphones starting at Rs 5,999. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X