ఛాటింగ్ చేయడానికి సరైన ఫోన్ హెచ్‌టిసి వైల్డ్ ఫైర్ ఎస్

Posted By: Staff

ఛాటింగ్ చేయడానికి సరైన ఫోన్ హెచ్‌టిసి వైల్డ్ ఫైర్ ఎస్

క్వాలిటీ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకొవడమే కాకుండా కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ హెచ్‌టిసి వైల్డ్ ఫైర్ ఎస్ పోన్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుండడంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది హెచ్‌టిసి మొబైల్స్. హెచ్‌టిసి వైల్డ్ లైఫ్ కంపెనీ విడుదల చేసే ప్రతి స్మార్ట్ ఫోన్‌లో కూడా జనరల్ నెట్ వర్క్ 3జీ, 2జీలను సపోర్ట్ చేస్తూ ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ వి2.3 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేటట్లుగా మొబైల్స్‌ని విడుదల చేస్తుంది. ఇది ఇలా ఉంటే దేశీయ దిగ్గజం మోటరోలా పోయిన అక్టోబర్‌లో విడుదల చేసిన మోటరోలా డెఫీకి కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ ముఖ్యంగా ఆండ్రాయిడ్ వర్సన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో మార్కెట్లోకి విడుదల చేయనుంది. అందుకే ఈరోజు ఈ రెండు మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్ తెలుసుకుందాం..

మోటరోలా డెఫీ ఇప్పటికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మొబైల్ పోన్. అతి పెద్ద డిస్ ప్లే సిస్టమ్‌ని కలిగి మోటరోలా యూజర్ ఇంటర్ ఫేస్‌తో పాటు టచ్ సెన్సిటివ్ కంట్రోల్స్‌ని కలిగి ఉన్న ఫోన్ మోటరోలా డెఫీ. ఇదే ఫీచర్‌ని హెచ్‌టిసి వైల్డ్ లైఫ్‌లో కూడా రూపోందించడం జరిగింది. హెచ్‌టిసి వైల్డ్ లైఫ్‌లో ఆటో రోటేట్ కోసం యాక్సలిరోమేటర్ ఉండగా, అదే ఆటోమ్యాటిక్ టర్న్ ఆఫ్ కోసం ప్రాక్సిమిటీ సెన్సార్ ఫీచర్స్ ఉన్నాయి.

వీటితోపాటు అదనంగా హెచ్‌టిసి వైల్డ్ పైర్ ఎస్ లో ప్రత్యేకంగా turn-to-mute, lift-to-tune-down flip లాంటి ఫీచర్స్ అదనం. హెచ్ టిసి 2.1 యూజర్ ఇంటర్ ఫేస్ సెన్సార్స్ వైల్డ్ పైర్ ఎస్‌లో ఉన్న యునిక్ ఫీచర్. రెండు మొబైల్స్ కూడా మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేయడమే కాకుండా కామన్‌గా రెండింటికి MP3 WAV రింగ్ టోన్ ప్రత్యేకం.

మోటరోలా డెఫీలో మొబైల్‌తో పాటు 2జిబీ ఇంటర్నల్ మొమొరీ 512MB ప్రాసెసర్‌ని కలిగి ఉండి మొమొరీని ఎక్పాండ్ చేసుకునేందుకు గాను ఇందులో మైక్రో ఎస్ డి స్లాట్ కూడా ఉంది. మొబైల్ బ్యాటరీ బ్యాక్ అప్ విషయానికి వస్తే కంటిన్యూగా మొబైల్‌ని వాడినట్లైతే 7గంటల 10 నిమిషాలు వస్తుంది. అదే స్టాండ్ బై టైమ్ మాత్రం 360 గంటలుగా అభివర్ణించారు. ఇక మోటరోలా డెఫీ మొబైల్ కంటిన్యూగా వాడినట్లైతే 6 గంటల 48 నిమిషాలు రాగా, స్టాండ్ బై టైమ్ మాత్రం 238 గంటలు ఇస్తుందని తెలిపారు.

కనెక్టివిటీ ఫీచర్స్ విషయంలో మోటరోలా డెఫీ, హెచ్‌టిసి వైల్డ్ ఫైర్ ఎస్ కంటే చాలా స్పీడ్‌గా యాక్సెస్ చేస్తుందని నిపుణులు తెలిపారు. హెచ్‌టిసి వైల్డ్ ఫైర్ ఎస్ సోషల్ నెట్ వర్కింగ్‌కి సంబంధించిన ఫోన్ కాకపోయినప్పటికీ ఇంటర్నెట్‌ని చాలా ఫాస్టుగా యాక్సెస్ చేస్తుంది. హెచ్‌టిసి వైల్డ్ ఫైర్ ఎస్‌లో డిజిటల్ కంపాస్, గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్ అప్లికేషన్స్, పికాసో ఫోటో ఇమేజిలను సపోర్ట్ చేస్తుంది. చాట్ అప్లికేషన్స్ అయినటువంటి యూట్యూబ్, గూగుల్ టాక్ మొదలగునవి ప్రీలోడెడ్ చేయబడి ఉన్నాయి.

రెండు మొబైల్స్ కూడా 5 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండడంతో యూజర్స్‌కి చక్కని ఇమేజిలను, వీడియోలను తీసుకునే అవకాశం ఉంది. మోటరోలా డెఫీ ఖరీదు సుమారుగా రూ 15,500 ఉండగా అదే హెచ్‌టిసి వైల్డ్ ఫైర్ ఎస్ ధర సుమారుగా రూ 13,399గా ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot