జియోఫోన్ Vs నోకియా 8110 4G, సవాల్ చేసే ఫీచర్లు ఏంటీ ?
హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా మరో సంచలనపు ఫోన్ ద్వారా మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అయింది.
హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా మరో సంచలనపు ఫోన్ ద్వారా మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అయింది. స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018లో నోకియా 8110 4జీ ఫోన్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇది ఎట్టకేలకు మార్కెట్లోకి విడుదలయింది. ముందుగా యూరోపియన్ మార్కెట్లో ఇది అమ్మకానికి రానుంది. దీని ధర అక్కడ సుమారు రూ. 4999గా ఉంది. సింగపూర్ రీటెయిలర్ Lazada దీన్ని విక్రయానికి తెస్తోంది. మరి ఈ ఫోన్ ఇండియాకి త్వరలో రానున్న నేపథ్యంలో జియో ఫోన్ కి ఇది సవాల్ విసిరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఫీచర్లను ఓ సారి పరిశీలిద్దాం..

జియో ఫోన్ ఫీచర్లు
2.4 అంగుళాల QVGA టీఎఫ్టీ డిస్‌ప్లే, 1.2GHz సీపీయూ, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (4జీ సిమ్ + 2జీ సిమ్), 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో

నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్ ఫీచర్లు
2.4 ఇంచ్ క్యూవీజీఏ డిస్‌ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ 205 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, ఎక్స్‌పాండబుల్ మెమొరీ, డ్యుయల్ సిమ్, కాయ్ ఓఎస్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), ఐపీ 52 డ్రిప్ ప్రొటెక్షన్, 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, యూఎస్‌బీ 2.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హార్డ్‌వేర్
నోకియా 8110 4జీ ఫోన్ 1.1Ghz dual-core Qualcomm 205 మొబైల్ ప్రాసెసర్ తో పాటు 512MB RAM/ 4GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చింది.అలాగే విస్తరణ సామర్ధ్యం కూడా ఉంది. 2 ఎంపీ కెమెరాతో పాటు 1,500mAh battery ఉంది. అలాగే 4జీ వోల్ట్ కనెక్షన్ మీద 9.32 గంటల పాటు నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
ఇక జియోఫోన్లో Qualcomm 205తో పాటు 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, ఎక్స్‌పాండబుల్ మెమొరీ ఉంది. అయితే కెమెరా మాత్రం రెండు ఒకటి అయినప్పటికీ జియో ఫోన్లో 0.3 మెగా ఫిక్సల్ కెమెరాను పొందుపరిచారు. కాగా బ్యాటరీ 2,000mAhతో నోకియా కన్నా ముందు వరసలోనే ఉంది. రెండు ఫోన్లు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే అవకాశం కూడా ఉంది.

ఇతర ఫీచర్లు
రెండు ఫోన్లు KaiOSతో రాగా Firefox OS మీద రన్ అవుతాయి. కాగా నోకియా బనానా ఫోన్ సొంత యాప్స్ తో వచ్చింది. Facebook, Twitter, Google Maps, Google Assistan, Snakeగేమ్ లాంటివి ఇందులో ఉన్నాయి. ధర్డ్ పార్టీ యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే వాట్సప్ కూడా ఇందులో వస్తోంది. ఇంకా మరిన్ని ఫీచర్లను అందుబాటలోకి తీసుకువస్తామని HMD చెబుతోంది.
కాగా జియోలో కేవలం జియోకి సంబంధించిన యాప్స్ మాత్రమే ఉన్నాయి. JioTV, JioMusic, JioExpress, JioCinema, JioMessaging and Jio Video Call లాంటివి ఉన్నాయి. ఈ మధ్యనే Facebook and Google Assistant ఓపెన్ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా జియో ఫోన్ JioMoney ద్వారా చెల్లింపులకు అవకాశం కల్పిస్తోంది. అలాగే టీవి సదుపాయం కూడా ఉంది.

డిజైన్, ధర
కాగా డిజైన్లో నోకియా 8110 స్టైలిష్ గా కనిపిస్తుంది. స్లైడర్ దగ్గర నుంచి కీ బోర్డ్ దాకా అంతా అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అయితే జియోఫోన్లో ఆ అవకాశం లేదు. ఫోన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక ధర విషయానికొస్తే నోకియా 8110 ధర 79 యూరోలుగా ఉంది. ఇండియాలో ఇది మరింతగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఇది ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. అయితే జియో ఫోన్ రూ.1500 రీఫండ్ తో మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications








