నోకియా 601 లేక 603నా..?

Posted By: Staff

నోకియా 601 లేక 603నా..?

 

ప్రపంచంలో ఉన్న మొబైల్ సంస్దలలో మూడవ స్దానాన్ని ఆక్రమించిన నోకియా అత్యాధునిక, నాణ్యమైన ఉత్పత్తులను కస్టమర్స్ కొసం మార్కెట్లోకి ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన నోకియా వరల్డ్ మీటింగ్‌లో 'నోకియా సంస్ద లుమియా సిరిస్'ని పరిచయం చేయడం జరిగింది. నోకియా 603 మొబైల్ నోకియా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ సింబియన్ బెల్లీతో రన్ అవుతుండడం నోకియా అభిమానులకు శుభవార్త. అదే విధంగా నోకియా 601 మొబైల్ మాత్రం మైక్రోసాప్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 'విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో'తో మార్కెట్లోకి విడుదల కానుంది.

ఈ సందర్బంలో ఈ రెండు మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి సమాచారం మొబైల్ అభిమానులకు క్షుణ్ణంగా అందివ్వడం జరుగుతుంది. మొదటగా నోకియా 603 మొబైల్ ప్రత్యేకతలను పరిశీలిస్తే 3.5 ఇంచ్ డిస్ ప్లేతో పాటు స్కీన్ రిజల్యూషన్ 360 x 640  ఫిక్సల్‌గా కలిగి ఉంది. మొబైల్ చుట్టుకొలతలు 113.5 x 57.1 x 12.7 mm. అదే నోకియా 601 విషయానికి వస్తే మొబైల్ స్క్రీన్ డిస్ ప్లే సైజు 3.7 ఇంచ్‌లు.

నోకియా 603 మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయడమే కాకుండా, జియోటాగింగ్, ఫేస్ డిటెక్షన్ లాంటి కెమెరా ప్రత్యేకతలు ప్రత్యేకం. అదే నోకియా 601 మొబైల్‌లో 8 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. నోకియా 603 మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను 1GHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయగా, నోకియా 601 మొబైల్‌లో 1GHz క్వాలికామ్ స్నాప్ డ్రాగెన్ MSM 8255 ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

రెండు మొబైల్స్‌లలో కూడా 512 MB RAM ఇమడింపజేయగా, ఇందులో ఉన్న మైక్రోఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు నిక్షిప్తం చేయడం జరిగింది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై - పైలను రెండు మొబైల్స్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆడియో, వీడియో ప్లేయర్స్ మార్కెట్లో లభించే MP3, MPEG4, AAC+ ఫార్మెట్లను సపొర్ట్ చేస్తాయి.

నోకియా మొబైల్స్ అంటే బ్యాటరీ బ్యాక్ అప్ గురించి చెప్పుకొవాల్సిన పని లేదు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియా లుమియా 603 మొబైల్ ధర సుమారుగా రూ 20, 000 ఉండగా, అదే నోకియా 601 మొబైల్ ధరని ఇంకా మార్కెట్లో వెల్లిడంచ లేదు .

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot