తక్కువ ధరలో నోకియా స్మార్ట్ ఫోన్స్ సి5, 500

Posted By: Super

తక్కువ ధరలో నోకియా స్మార్ట్ ఫోన్స్ సి5, 500

కస్టమర్స్‌కు ఎటువంటి మొబైల్స్ ఐతే సూట్ అవుతాయో అటువంటి అన్ని రకాల ఫీచర్స్‌తో మొబైల్స్‌ని రూపోందిస్తుంది కాబట్టే నోకియా నెంబర్ మొబైల్ కంపెనీ కాగలిగింది. ఇటీవల కాలంలో నోకియా మార్కెట్లోకి విడుదల చేసిన నోకియా 500, నోకియా సి5 రెండు మొబైల్స్ గురించిన సమాచారం తెలుసుకుందాం. తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ కేటగిరికి సంబంధించింది నోకియా 500. 1GHZ ప్రాసెసర్‌ని కలిగి ఉండి, ఆన్ లైన్ ఇంటర్నెట్ యాక్షన్స్‌ని చాలా ఫాస్ట్ గా చేయగలిగే సామర్ద్యం ఉన్న మొబైల్ నోకియా 500. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.2 ఇంచ్ స్క్రీన్ సైజులో రూపోందించబడింది.

ఇక నోకియా సి5 విషయానికి వస్తే ముఖ్యంగా ఈ మొబైల్‌ని ప్రస్తుతం ఉన్న యూత్‌ని దృష్టిలో పెట్టుకోని రూపోందించడం జరిగింది. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ లలో లాగిన్ అవ్వడంతో పాటు, ఇమేజిలను, ఫోటోలను అప్ లోడ్ లేదా ఆన్ లైన్ షేరింగ్ చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా మొమొరీ 16జిబి వరకు వస్తుంది. ఈ మొబైల్ కూడా నోకియా 500 మాదరే 3.2 ఇంచ్ స్క్రీన్ డిస్ ప్లే సైజుని కలిగి ఉంది. నోకియా 500లో మాత్రం ఇంటర్నల్ మొమొరీ కేవలం 2జిబి వరకు మాత్రమే ఉంటుంది. రెండు మొబైల్స్‌లలో కూడా మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని ఎక్పాండ్ చేసుకునేటటువంటి వెసులుబాటు కూడా ఉంది.

నోకియా సి5లో క్వాలిటీ ఇమేజిలను, ఫోటోలను తీసేందుకుగాను 5 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు డ్యూయల్ ఎల్ ఈడి ప్లాష్ అదనం. ఇక మొబైల్ ముందు భాగంలో ఉన్న కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌కి సపోర్ట్ చేస్తుంది. నోకియా 500 కూడా 5 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండి చక్కని వీడియోలను తీయడానికి ఉపయోగపడుతుంది. రెండు మొబైల్స్‌ని వీడియో క్వాలిటీతో గనుక పోల్చితే నోకియా 500 బెస్ట్ వీడియో క్వాలిటీని అందిస్తుంది.

ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలు అయినటువంటి బ్లూటూత్, వై-పై, 2జీ ఇంటర్నెట్ టెక్నాలజీలు అయిన జిపిఆర్ ఎస్, ఎడ్జిలను కూడా సపోర్ట్ చేస్తాయి. నోకియా సి5 మొబైల్‌ని కొనుక్కున్న యూజర్స్ వారియొక్క మనీకి తగ్గ మొబైల్ లభించిందని గర్వించిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఇక మొబైల్ ధర విషయానికి వస్తే నోకియా సి5 రూ 8000గా ఉండగా, అదే నోకియా 500 మాత్రం రూ 9456గా మార్కెట్ ధర నిర్ణయిండమైంది. ఇది ఇలా ఉంటే నోకియా 500 మొబైల్ విడుదల తేదీ ఎప్పుడనేది ఇంకా ఇండియన్ మార్కెట్లో వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot