ది బెస్ట్ ఎవరు..?

Posted By: Staff

ది బెస్ట్ ఎవరు..?

 

నోకియా, ఎల్‌జీలు డిజైన్ చేసిన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్స్ ఉపయుక్తమైన ఫీచర్లతో విడుదలకు ముందే అంచనాలు రేపుతున్నాయి. ఎల్‌జీ కుకీ, నోకియా 103లుగా డిజైన్ కాబడిన ఈ హ్యాండ్‌సెట్ల ఫీచర్లను క్లుప్తంగా పరిశీలిద్దాం...

నోకియా 103:

స్ర్కీన్ పరిమాణం 1.3 అంగుళాలు (రిసల్యూషన్ 96 x 68పిక్సల్స్),

ఫోన్ బరువు 76.6 గ్రాములు,

సిరీస్ 30 ఆపరేటింగ్ సిస్టం,

ఫోన్‌బుక్ సామర్ధ్యం (500 ఎంట్రీస్ వరకు),

నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ),

ఆడియో ప్లేయర్,

గేమ్స్,

ఎఫ్ఎమ్ రేడియో,

లౌడ్ స్సీకర్,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

లియోన్ 800mAh బ్యాటరీ (స్టాండ్ బై 648గంటలు, టాక్ టైమ్ 11 గంటలు),

ధర అంచనా రూ.13,00.

ఎల్‌జీ కుకీ స్మార్ట్:

3.2 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ ( రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), ఫోన్ బరువు 96 గ్రాములు, ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (రిసల్యూషన్ 1600x1200పిక్సల్స్),

వీడియో రికార్డింగ్, మైక్రో‌ఎస్డీ కార్డ్‌స్లాట్, జీపీఆర్ఎస్ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్, 2జీ కనెక్టువిటీ, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, లౌడ్‌స్పీకర్, 3.5ఎమ్ఎమ్

ఆడియోజాక్, స్టాండర్డ్ లియోన్ బ్యాటరీ, ధర వివరాలు తెలయాల్సి ఉంది.

ఎల్‌‍జీ కుకీ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన పలు ఫీచర్లు నోకియా 103లో లోపించాయి. ప్రధానంగా కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ వంటి అంశాలు నోకియాలో కనిపించవు. సాధారణ ఫీచర్లతో రూపుదిద్దుకున్న నోకియా 103 ఇండియన్ మార్కెట్ విలువ రూ.1300 (అంచనా మాత్రమే). స్మార్ట్ ఫోన్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఎల్‌జీ కుకీ ధర ఇతర విడదల అంశాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot