మెగా ఫ్యామిలీ ‘హ్యాట్రిక్ వండర్’!!

Posted By: Super

మెగా ఫ్యామిలీ ‘హ్యాట్రిక్ వండర్’!!

సామ్‌సంగ్ కుటుంబం నుంచి తాజాగా విడుదలైన గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా వేడి పుట్టిస్తుంది. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో రూపుదిద్దుకున్న ఈ హ్యాండ్‌సెట్ పనితీరు విషయంలో పూర్తి‌స్థాయి సంతృప్తినిస్తుంది. ఈ మెగా సిరీస్ నుంచి తొలిగా విడుదలైన గెలాక్సీ ఎస్ స్మార్ట్‌ఫోన్ అప్పట్లో సంచలనం సృష్టంచగా, ఆ మోడల్‌కు సక్సెసర్‌గా విడుదలైన గెలాక్సీ ఎస్2 ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. వీటికి అప్‌డేటెడ్ వర్షన్‌గా విడుదలైన గెలాక్సీ ఎస్3, ఏ విధమైన రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి.

సామ్‌సంగ్ మెగా ఫ్యామిలీ నుంచి విడుదలైన గెలాక్సీ ఎస్, ఎస్3, ఎస్3 స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్లు క్లుప్తంగా...

గెలాక్సీ ఎస్:

4 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,


ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ కోర్ 1000 మెగాహెడ్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఇంటర్నల్ స్టోరేజ్ 512ఎంబీ, ఎక్సటర్నల్ స్టోరేజ్ 32జీబి, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్ 10), ఎడ్జ్ (క్లాస్ 10), వై-ఫై, బ్లూటూత్ (3.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (క్రోమ్‌లైట్, హెచ్‌టిఎమ్ఎల్, ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ,3జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (స్టాండ్‌బై 750 గంటలు, టాక్‌టైమ్ 6.55గంటలు). ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 2010లో విడుదలైంది. బరవు 118 గ్రాములు. ధర రూ.31,500.

గెలాక్సీ ఎస్2:

4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్‌ ప్లస్ మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ2.3.4 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ-400మెగా పిక్సల్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos చిప్‌సెట్, 8 మెగాపిక్సల్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్‌ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16జీబి, 32జీబి), ఎక్సటర్నల్ స్టోరేజ్ 32జీబి, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్ 12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-పై, బ్లూటూత్ (వీ3.0+హెచ్ఎస్), మైక్రోయూఎస్బీ వీ2.0 కనెక్టువిటీ, ఏ-జీపీఎస్ సపోర్ట్, బ్రౌజర్ (ఆడోబ్ ఫ్లాష్, హెచ్ టిఎమ్ఎల్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ,3జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, స్టాండర్డ్ లియోన్ 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ ( స్టాండ్‌బై 710 గంటలు, టాక్‌టైమ్ 18 గంటలు), ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 2011లో విడుదలైంది. బరవు 116 గ్రాములు. ధర రూ.28,000.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 1.4గిగాహెడ్జ్ ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264x2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఈ స్మార్ట్‌ఫోన్‌ను మే 3, 2012న ఆవిష్కరించారు. బరవు 133 గ్రాములు . ధర అంచనా రూ.38,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot