Home
Mobile

ఆ వివరాలు మా గుప్పెట్లో..?

By Super
Confirmed: Black Samsung Galaxy S3 will hit Stores in October 2012


ఇప్పటి వరకు పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 త్వరలో బ్లాక్ కలర్ వేరియంట్‌లో లభ్యంకానుంది. ఈ విషయాన్ని స్వయంగా సామ్‌సంగ్ ఇటీవల తన అధికారిక ఫేస్‌బుక్ పేజీ పై పోస్ట్ చేసింది. తాజాగా, ప్రముఖ యూకే ఆధారిత టెక్ బ్లాగ్ ‘మొబైల్ ఫన్’ గెలాక్సీ ఎస్‌3 బ్లాక్ కలర్ వేరియంట్ విడుదలకు సంబంధించి కీలక సమాచారాన్ని బహిర్గతం చేసింది. అక్టోబర్‌లో మార్కెట్లోకి రానున్న ‘గెలాక్సీ ఎస్3’ కొత్త కలర్ వేరియంట్‌కు సంబంధించి ధర ఇంకా విడుదల వివరాలు ప్రధమంగా తామే ప్రకటిస్తామని ఈ బ్లాగ్ పేర్కొంది.

ఆపిల్, నోకియా, మోటరోలా, హెచ్ టీసీ వంటి ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు తమ తమ ఫ్లాగ్ షిప్ మోడల్ స్మార్ట్ ఫోన్ లను ఈ సీజన్ లో లాంచ్ చేస్తున్న నేపధ్యంలో సామ్ సంగ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖంగా తెలుస్తోంది. మొత్తం మూడు ఫోటోలను సామ్‌సంగ్ తన అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో ప్రదర్శించింది. సామ్‌సంగ్ తీసుకున్న తాజా నిర్ణయం త్వరలో విడుదల కాబోతున్న ఆపిల్ ఐఫోన్ 5 అమ్మకాల పై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గెలాక్సీ ఎస్3 స్పెసిఫికేషన్ లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం(త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ కు అప్ డేట్ అయ్యే అవకాశం) , క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు.

పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 16జీబి మెమరీ వేరియంట్ ధర రూ.38400, 32జీబి మెమెరీ వేరియంట్ ధర రూ.41,500.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X