తిరుపతిలో మొబైల్స్ తయారీ ప్లాంట్ ను స్థాపించబోతున్న LAVA
దేశీయ ఫోన్ల తయారీ కంపెనీ లావా మొబైల్స్ త్వరలోనే తిరుపతిలో తమ కంపెనీ కొత్త ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది.
దేశీయ ఫోన్ల తయారీ కంపెనీ లావా మొబైల్స్ త్వరలోనే తిరుపతిలో తమ కంపెనీ కొత్త ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది.త్వరలో నిర్మాణ పనులను ప్రారంభిస్తామని దీనికి సంబంధించి లే అవుట్ కూడా సిద్ధమయిందని లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ గౌరవ్ నిగమ్ చెప్పారు.'ప్రస్తుతం లావా కంపెనీకి 1,100 మంది పంపిణీదారులున్నారు.ఈ నేపథ్యంలో మంగళవారం మార్కెట్లోకి తమ సరికొత్త స్మార్ట్ ఫోన్ అయిన లావా Z 61 స్మార్ట్‌ఫోన్‌ను లావా కంపెనీ విడుదల చేసింది.ఈ ఫోన్ ను రెండు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటులభిస్తున్నట్టుందని బడ్జెట్ ధరలో లభిస్తుందని నిగమ్ తెలిపారు.

10,000 జనాభా కంటే తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు....
ఇప్పటివరకు పట్టణ, సబ్-అర్బన్ ప్రాంతాలలో తమ ఉనికిని చాటుకున్న లావా ఇక నుంచి 10,000 జనాభా కంటే తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నం చేస్తోంది. వచ్చే 12-18 నెలల్లో 40 శాతం మార్కెట్ వాటాను సొంత చేసుకోవాలనేది సంస్థ లక్ష్యం. ఇందులో భాగంగా నోయిడా ప్లాంటులో ఉత్పత్తిని పెంచడం, తిరుపతి ప్లాంట్ నిర్మాణం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు గౌరవ్ నిగమ్ వివరించారు.

50 నుంచి 13కు తగ్గిన మోడల్స్....
గతంలో 50 మోడల్ ఫోన్స్ ను లాంచ్ చేసిన లావా ఇప్పుడు 13 మోడల్స్ మాత్రమే కలిగి ఉంది . అందులో 8 ఫీచర్ ఫోన్స్ కాగా 3 స్మార్ట్ ఫోన్స్.

ఆఫ్రికాకు ఎగుమతయ్యే హ్యాండ్‌సెట్ల తయారీ....
ఇప్పటి నుంచి ఆఫ్రికాకు ఎగుమతయ్యే హ్యాండ్‌సెట్ల తయారీ పూర్తిగా భారత్‌లోనే కొనసాగుతోందని లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ గౌరవ్ నిగమ్ చెప్పారు.

లావా Z 61 ధర....
రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండే ఈ లావా జెడ్61 సిరీస్ మొదటి వేరియంట్ ధర రూ.5,750 కాగా రెండవ వేరియంట్ ధర రూ.6,750గా కంపెనీ నిర్ణయించింది

లావా Z 61 ఫీచర్లు....
5.45 ఫుల్‌వ్యూ హెచ్‌డీ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1,2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో గో ఎడిషన్ , డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూ4.2త్ ,మైక్రో USB పోర్ట్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








