కూల్‌ప్యాడ్ నుంచి అత్యంత తక్కువ ధరకే రెండు 4జీస్మార్ట్‌ఫోన్లు

Written By:

చైనా దిగ్గజం Coolpad ఇండియాలో రెండు 4జీ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. 2జిబి ర్యామ్ తో పాటు సరికొత్త ఫీచర్లతో ఈ 4జీ ఫోన్లను కంపెనీ లాంచ్ చేసింది. అన్ని ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్లు ఎక్స్ క్లూజివ్ గా విక్రయానికి వచ్చాయి. Delhi NCR, Haryana, Telangana, Karnataka, Tamil Nadu, Andhra Pradesh, Uttar Pradesh and Maharashtraలోని అన్ని రీటెయిల్ స్టోర్లలో ఈ ఫోన్లు లభ్యమవుతాయని కంపెనీ తెలిపింది. ఫీచర్లు ధర వివరాలను పరిశీలిస్తే..

కూల్‌ప్యాడ్ నుంచి అత్యంత తక్కువ ధరకే రెండు 4జీస్మార్ట్‌ఫోన్లు

కూల్‌ప్యాడ్ ఎ1ను రూ.5,499 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది.
కూల్‌ప్యాడ్ ఎ1 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఫేస్‌బుక్‌లో తక్షణం వీటిని డిలీట్ చేయండి

కూల్‌ప్యాడ్ మెగా 4ఎ రూ.4,299 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది.
కూల్‌ప్యాడ్ మెగా 4ఎ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఈ ఫోన్లు వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తాయని బడ్జెట్ ధరలో ఈఏడాది మరిన్ని స్మార్ట్ ఫోన్లను ఇండియాకు తీసుకువచ్చేందుకు కంపెనీ కృషి చేస్తోందని వినియోగదారుల ఆసక్తిని చూరగొని మార్కెట్లో మంచి ఫలితాలను రాబడతామని కంపెనీ సీఈఓ Syed Tajuddin ధీమా వ్యక్తం చేశారు.

English summary
Coolpad A1, Coolpad Mega 4A launched in India, will be offline exclusive More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot