భారీగా తగ్గిన కూల్‌ప్యాడ్ ఫోన్ల ధరలు, రూ. 6 వేలతో మొదలు..

Written By:

చైనా మొబైల్ తయారీ దిగ్గజం కూల్‌ప్యాడ్ తన స్మార్ట్‌ఫోన్లపై భారత్‌లో ధరలు తగ్గించింది. మొత్తం మూడు స్మార్ట్‌ఫోన్లపై అధికారికంగా భారత్‌లో ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కాగా భారీ తగ్గింపును అందుకున్న ఈ ఫోన్లు అమెజాన్‌.ఇన్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ కొనాలనుకునే ఆసక్తి ఉన్నవారికి 0 శాతం ఈఎంఐ కొనుగోళ్లను కూడా అమెజాన్‌ ఆఫర్‌ చేస్తుంది. ఇంకా అదనంగా 500 రూపాయల వరకు ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ కూడా అందించనున్నట్టు పేర్కొంది. తగ్గింపు అందుకున్న ఫోన్ల వివరాలపై ఓ లుక్కేద్దాం.

మీ డబ్బుకి న్యాయం చేసే స్మార్ట్‌ఫోన్ హానర్ 9 లైట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కూల్‌ప్యాడ్‌ కూల్‌ 1 డ్యూయల్‌

కూల్‌ప్యాడ్‌ కూల్‌ 1 డ్యూయల్‌ (3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌)
తగ్గింపు రూ. 6వేలు
అదనంగా 500 రూపాయల వరకు ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 7999
లాంచింగ్‌ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 11,999 రూపాయలు
కూల్‌ప్యాడ్‌ కూల్‌ 1 డ్యూయల్‌ (4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌)
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 8999
లాంచింగ్‌ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 14,999 రూపాయలు

స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ 13 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండటం విశేషం. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్... ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్, 13 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్(4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన LeEco EUI పై ఫోన్ రన్ అవుతుంది. 4000mAh బ్యాటరీ, 4జీ వోల్ట్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.

కూల్‌ప్యాడ్‌ నోట్‌ 5 ( 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ )

తగ్గింపు రూ. 4వేలు
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 7999
లాంచింగ్‌ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 11,999 రూపాయలు

ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ లామినేటెడ్ డిస్‌ప్లే, స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

కూల్‌ప్యాడ్‌ నోట్‌ 5 లైట్

తగ్గింపు రూ. 4వేలు
అదనంగా 500 రూపాయల వరకు ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 5999
లాంచింగ్‌ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 8,999 రూపాయలు

 

 

మూడు స్మార్ట్‌ఫోన్లకు

ఈ మూడు స్మార్ట్‌ఫోన్లకు ముందు నుంచి మంచి స్పందన వస్తుందని కంపెనీ తెలిపింది. సరసమైన ధరల్లో మంచి నాణ్యతను, అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నామని, దీంతో కస్టమర్లు తమ డివైజ్‌లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. 

సరసమైన ధరల్లో..

ఈ ధర తగ్గింపుతో సరసమైన ధరల్లో కూల్‌ప్యాడ్‌ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లకు ఇది గొప్ప అవకాశమని కూల్‌ప్యాడ్‌ ఇండియా సీఈవో సయ్యద్‌ చెప్పారు. డిస్కౌంట్‌ ఆఫర్‌తో అద్భుతమైన స్పందనను తాము పొందనున్నట్టు ఆశాభావం వ్యక్తంచేశారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Coolpad Cool 1, Note 5, Note 5 Lite smartphones receive price cut of up to Rs 6,000 in India More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot