4జీబి ర్యామ్‌తో ‘Coolpad Cool 2’
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ కూల్‌ప్యాడ్ ‘Coolpad Cool 2’ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తన హోమ్‌ల్యాండ్‌లో లాంచ్ చేసింది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉ
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ కూల్‌ప్యాడ్ 'Coolpad Cool 2' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తన హోమ్‌ల్యాండ్‌లో లాంచ్ చేసింది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌కు 4జీబి ర్యామ్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫోన్ 5.7 అంగుళాల హైడెనిఫినిషన్ ప్లస్ డిస్‌ప్లేన కలిగి ఉంటుంది. స్ర్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1440×720 పిక్సల్‌గా ఉంటంది. 18:9 యాస్పెక్ట్ రేషియోతో వచ్చిన ఈ డిస్‌ప్లేను 2.5డి కర్వుడ్ గ్లాస్ పూర్తిగా కవర్ చేస్తుంది.

హార్డ్‌వేర్ స్పెక్స్ విషయానికి వచ్చేసరికి...
కూల్‌ప్యాడ్ కూల్ 2, 64-బిట్ మీడియాటెక్ ఎంటీ6750 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌కు అటాచ్ చేసిన Mali T-860 జీపీయూ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది. ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే కూల్ 2 ఫోన్ 4జీబి ర్యామ్‌తో లోడై ఉంది. 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్‌ను కూడా ఈ ఫోన్ ద్వారా కూల్ ప్యాడ్ అందిస్తోంది.
కెమెరా విషయానికి వచ్చేసరికి...
కూల్‌ప్యాడ్ కూల్ 2 ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఫోన్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన 13 మెగా పిక్సల్ + 0.3 మెగా పిక్సల్ సెన్సార్లు క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తాయి. ఫోన్ ముందు భాగంలో నిక్షిప్తం చేసిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో క్వాలిటీ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకోవచ్చు.
ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి
కూల్‌ప్యాడ్ కూల్ 2 డివైస్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్ పై రన్ అవుతుంది. శక్తివంతమైన 3,200mAh బ్యాటరీ ఈ డివైస్‌కు ఛార్జింగ్‌ను సమకూరుస్తుంది. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి 4జీ ఎల్టీఈ, VoLTE, వై-ఫ, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ డివైస్ లో ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో ఈ డివైస్ ధర రూ.12,000లోపు ఉండొచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications