Cool Play 6 మొదటి సేల్ ఈ రోజే
అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యం, జియో యూజర్లకు 20జీబి అదనపు డేటా...
కూల్‌ప్యాడ్ బ్రాండ్ నుంచి కొద్ది రోజుల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ Cool Play 6 మొదటి సారిగా సేల్ పై లభ్యమవుతోంది. ఈ ఫోన్‌ను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ధర రూ.14,999. లాంచ్ ఆఫర్ క్రింద ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే జియో యూజర్లు రూ.309 అంతకన్నా ఎక్కువ రీఛార్జ్ పై 20జీబి అదనపు డేటా లభిస్తుంది. నో కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యం కూడా ఈ ఫోన్ పై కల్పిస్తున్నారు.

కూల్‌ప్యాడ్ నోట్ 6 స్పెసిఫికేషన్స్.. 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 8.0 అప్‌గ్రేడబుల్), 1.4GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 635 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 64జీబి ఇన్‌బిల్ట్ స్టోరేజ్, స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునేందుకు మైక్రోఎస్డీ స్లాట్, డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా (13 మెగా పిక్సల్ +13 మెగా పిక్సల్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ (నానో+నానో), 4000mAh బ్యాటరీ, 4G VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ, f/2.0 aperture, డ్యుయల్ టోన్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ వంటి స్పెషల్ ఫీచర్స్‌తో వస్తోన్న కూల్ ప్లే 6 ఫోన్ కెమెరా ద్వారా హెచ్‌డిఆర్ ఇంకా 4కే క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications