రూ.14,000కే 6జీబి ర్యామ్‌ ఫోన్

కూల్‌ప్యాడ్ మరో సంచలన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఆగష్టు 20న లాంచ్ కాబోతోన్న ఈ ఫోన్ ఏకంగా 6జీబి ర్యామ్‌తో వస్తోంది.

Read More : రెడ్‌మి నోట్ 4 రికార్డ్, 6 నెలల్లో 50 లక్షల ఫోన్‌ల అమ్మకాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర అందరికి అందుబాటులో ఉండే విధంగా

చైనా మార్కెట్లో ఈ ఫోన్ ధర 1499 Yuanలుగా ఉందడి. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.14,000. కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 ఇండియన్ వేరియంట్ ధర అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Cool Play 6 స్పెసిఫికేషన్స్..

ప్రీమియమ్ మెటల్ బాడీ, 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఇన్-సెల్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 635 ప్రాసెసర్ (Quad 1.95GHz ARM Cortex A72 + Quad 1.44GHz A53), అడ్రినో 501 జీపీయూ.

Cool Play 6 స్పెసిఫికేషన్స్..

6జీబి ర్యామ్, 64జీబి ఇంట్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా (13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4060 mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Coolpad Cool Play 6 with 6GB RAM and 13MP dual rear camera setup to launch in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot