6జీబి ర్యామ్‌‌తో Coolpad ఫోన్, ఇండియా రిలీజ్ ఎప్పుడంటే?

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ కూల్‌ప్యాడ్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్, Coolpad Cool S1ను త్వరలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. కూల్‌ప్యాడ్ సంస్ధ ఈ ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్లో లభ్యమవుతోంది. మే ఆరంభంలో భారత్ కు తీసుకురానున్నారు. కూల్ సిరీస్ నుంచి రాబోతోన్న కూల్‌ప్యాడ్ కూల్ ఎస్1 ఫోన్‌ను కూల్‌ప్యాడ్ అలానే లీఇకోలు సంయుక్తంగా అభివృద్ధి చేసాయి.

Read More : షాకింగ్... నోకియా 3310 ఫోన్‌ ఆ దేశాల్లో పనిచేయదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మూడు రకాల వేరియంట్‌లలో

చైనా మార్కెట్లో మూడు రకాల వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. 4జీబి ర్యామ్ +32జీబి స్టోరేజ్, 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్, 6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్. ఫోన్ ఇతర స్ససిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి...

కూల్‌ప్యాడ్ కూల్ ఎస్1 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం విత్ EUI 5.8 యూజర్ ఇంటర్‌ఫేస్, 2.35GHz క్వాడ్ - కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్ విత్ అడ్రినో 530 జీపీయూ,

కూల్‌ప్యాడ్ కూల్ ఎస్1 స్పెసిఫికేషన్స్

ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియరంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ, 4070mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.

Harman Kardon AKG N18 ఇయర్‌ఫోన్‌లతో...

ప్రత్యేకమైన Harman Kardon's టోన్ ట్యూనింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌తో పాటు Harman Kardon AKG N18 ఇయర్‌ఫోన్‌లను కూల్‌ప్యాడ్ అందిస్తోంది. చౌకధర స్మార్ట్‌ఫోన్‌లకు పెట్టింది పేరు అయిన కూల్‌ప్యాడ్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధరను ఏ విధంగా నిర్ణయించనుందో వేచి చూడాలి.

రూ.700కే కంప్యూటర్ తయారు చేసుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Coolpad Cool S1 set to launch in India in May. Read More in Telugu Gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot