కూల్‌ప్యాడ్ కొత్త ఫోన్‌లు, 5జీబి ర్యామ్‌తోనా..?

రూ.10,000 రేంజ్ లో 4జీ ర్యామ్ ఫోన్‌ను లాంచ్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కూల్‌ప్యాడ్ కంపెనీ నుంచి త్వరలో రెండు కొత్త ఫోన్‌లు లాంచ్ కాబోతున్నాయి.

 కూల్‌ప్యాడ్ కొత్త ఫోన్‌లు, 5జీబి ర్యామ్‌తోనా..?

Read More : పెద్ద పెద్ద వీడియో ఫైల్స్‌ను VLC ప్లేయర్‌లో కంప్రెస్ చేయటం ఎలా..?

కూల్‌ప్యాడ్ మెగా 3, కూల్‌ప్యాడ్ నోట్ 3ఎస్ మోడల్స్‌లో లాంచ్ కాబోతున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల పై మార్కెట్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నవంబర్ 30న మార్కెట్లో లాంచ్ కాబోతున్న ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి స్పెసిఫికేషన్స్ వెల్లడికావల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్

4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి శక్తివంతమైన స్పెక్స్‌తో Note 5 స్మార్ట్‌ఫోన్‌ను కూల్‌ప్యాడ్ ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలసిందే. ధర రూ.10,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ Amazon India అక్టోబర్ 20 నుంచి ఈ ఫోన్ లను ఎక్స్ క్లూజివ్ గా విక్రయిస్తోంది. హై-ఎండ్ ఫోన్‌లతో సమానంగా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లో పొందుపరిచిన 5 శక్తివంతమైన ఫీచర్లను ఇప్పుడు చూద్దాం...

క్తివంతమైన 4010 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

కూల్‌ప్యాడ్ Note 5 ఫోన్ శక్తివంతమైన 4010 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. సింగ్ ఛార్జ్ పై 200 గంటల స్టాండ్ బై టైమ్‌ను ఆస్వాదించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ రిమూవబుల్ బ్యాటరీని సులువుగా రీప్లేస్ చేసుకునే వీలుంటుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

4జీబి ర్యామ్‌..

కూల్‌ప్యాడ్ Note 5 ఫోన్ ఏకంగా 4జీబి ర్యామ్‌తో వస్తోంది. 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. గ్రాఫిక్స్ భాగాన్ని ఆర్మ్ కార్టెక్స్ ఏ53 జీపీయూ చూసుకుంటుంది. ఈ విధమైర స్పెక్ కాంభినేషన్‌లో వస్తోన్న కూల్‌ప్యాడ్ Note 5లో మల్టీ టాస్కింగ్ అదరహో అనిపిస్తుంది.

32జీబి ఇంటర్నల్ స్టోరేజ్...

కూల్‌ప్యాడ్ Note 5 ఫోన్‌లో ఏకంగా 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 64జీబి వరకు విస్తరించుకోవచ్చు.

ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్..

కూల్‌ప్యాడ్ Note 5 ఫోన్‌లో సెక్యూరిటీకి మరింత ప్రాధాన్యత కల్పిస్తూ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్‌ను ఏర్పాటు చేసారు. ఆధునిక సాఫ్ట్‌వేర్ పై స్పందించే ఈ స్కానర్ ద్వారా కేవలం 0.5 సెకన్ల వ్యవధిలో ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

డ్యుయల్ స్పేస్ సిస్టం..

కూల్‌ప్యాడ్ Note 5 డ్యుయల్ స్పేస్ సిస్టం సపోర్ట్‌తో వస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ రెండు వేరువేరు అకౌంట్‌లను ఫోన్‌లో నిర్వహించుకోచ్చు. వాట్సాప్, ఫేస్‌బుక్, మెసెంజర్ వంటి యాప్స్‌ను రెండేసి చప్పున మెయింటేన్ చేయవచ్చు.

కూల్‌ప్యాడ్ నోట్ 5 స్పెసిఫికేషన్స్...

2.5డి కర్వుడ్ గ్లాస్‌‌తో కూడిన 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1920×1080పిక్సల్స్, 4జీబి ర్యామ్‌, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్‌, అడ్రినో 405 జీపీయూ

కూల్‌ప్యాడ్ నోట్ 5 స్పెసిఫికేషన్స్...

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ సపోర్ట్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 4,010 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్ రన్ అవుతుంది. విత్ Cool UI Version 8.0 యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Coolpad Mega 3 and Note 3S to be Unveiled in India on November 30: Specs, Pricing, and More. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot