రూ.6,999లో ఏది బెస్ట్ ఫోన్..?

|

రూ.6,999 ధర రేంజ్‌లో ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన 4జీ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో రెండు చైనా స్మార్ట్‌‍ఫొన్‌ల మధ్య హోరాహోరి పోటీ వాతావరణం నెలకుంది. Xiaomi Redmi 3S రూ.6,999 వేరియంట్‌కు కౌంటర్‌గా Coolpad మోగా 2.5డీ స్మార్ట్‌ఫోన్‌ను రంగంలోకి దింపింది.

రూ.6,999లో ఏది బెస్ట్ ఫోన్..?

Read More : Android గురించి మీకు తెలియని నిజాలు..?

రూ.6,999 ధర ట్యాగ్‌లో లభ్యంకానున్న కూల్‌ప్యాడ్ 2.5డీ ఫోన్‌ను ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ Amazon ఆగష్టు 24 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. ఈ ఫ్లాష్‌సేల్‌కు సంబంధించిన రిజిష్ట్రేషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరోవైపు Redmi 3S ఇప్పటికే తన మొదటి ఫ్లాష్‌ సేల్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల మధ్య spec comparisonను ఇప్పుడు చూద్దాం...

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి కూల్‌ప్యాడ్ 2.5డీ ఫోన్ 5.5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ డిస్‌ప్లేతో కూడిన 2.5డి కర్వుడ్ గ్లాస్‌తో వస్తోంది. మరోవైపు.. రెడ్మీ 3ఎస్, 5 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది.

హార్డ్‌వేర్ విషయానికొస్తే..

హార్డ్‌వేర్ విషయానికొస్తే..

ఈ ఫోన్‌లకు సంబంధించి హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌‍లను పరిశీలించినట్లయితే కూల్‌ప్యాడ్ 2.5డీ ఫోన్ 1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, మాలీ టీ720 జీపీయూ, 3జీబి ర్యామ్ వంటి ఫీచర్లతో వస్తోంది. మరోవైపు షియోమీ రెడ్మీ 3ఎస్ ఫోన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్ యానట్, 2జీబి ర్యామ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా స్టోరేజ్ మెమరీని మరింతగా ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. కూల్‌ప్యాడ్ ఫోన్ CoolUI 8.0 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోండగా, షియోమీ రెడ్మీ 3ఎస్ MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది.

 కెమెరా విషయానికి వచ్చేసరికి...

కెమెరా విషయానికి వచ్చేసరికి...

కూల్‌ప్యాడ్ ఫోన్.. 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఎల్ఈడి ఫ్లాష్, సోనీ సెన్సార్, f/2.2 aperture, 83.6 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. మరోవైపు రెడ్మీ 3ఎస్.. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. పీడీఏఎఫ్, ఎల్ఈడి ఫ్లాష్, f/2.0 aperture వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి.

 

హైబ్రీడ్ డ్యుయల్ సిమ్

హైబ్రీడ్ డ్యుయల్ సిమ్

డ్యుయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ఫోన్‌లో 4,100 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన మాసివ్ బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేసారు. మరోవైపు కూల్‌ప్యాడ్ మెగా 2.5డీ ఫోన్ 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

రూ.6,999 ధర ట్యాగ్‌లో

రూ.6,999 ధర ట్యాగ్‌లో

రూ.6,999 ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉన్న ఈ రెండు స్మార్ట్‌పోన్‌లు వేటికవే ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఫోన్ ఎంపిక మీ అభిరుచిని బట్టి ఆధారపడి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Coolpad Mega 2.5D vs Xiaomi Redmi 3S: Which is a Better Buy at Rs 6,999. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X