4జీబి ర్యామ్, 13 ఎంపీ కెమెరా, 32జీబి స్టోరేజ్.. ఫోన్ ధర రూ.10,999 మాత్రమే!

Coolpad Note 5 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను కూల్‌ప్యాడ్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో వస్తోన్న ఈ లేటెస్డ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,999. భారీ అంచనాల మధ్య ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్ మొదటి ఇంప్రెషన్స్‌ను ఇప్పుడు చూద్దాం..

Read More : నా ఫోన్‌ను ఏం చేయమంటారు..?, సామ్‌సంగ్‌కు అమితాబ్ సూటి ప్రశ్న!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రీమియమ్ లుక్...

కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్ మీకు మొదటి చూపులోనే ప్రీమియమ్ లుక్ ను కలిగిస్తుంది. షియోమీ రెడ్మీ నోట్ 3 తరహా బ్యాక్ ప్యానల్ తో వస్తోన్న ఈ ఫోన్ చేతిలో కొంచం బల్కీగా అనిపిస్తుంది. మెటల్ బాడీ డిజైనింగ్ ఆకట్టుకుంటుంది.

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్, 2.5డి కర్వుడ్ గ్లాస్‌‌తో కూడిన 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1920×1080పిక్సల్స్. ఫోన్ డిస్‌ప్లే నాణ్యమైన టచ్ రెస్సాన్స్‌‍ను ఆఫర్ చేస్తుంది. ఉత్పత్తి చేసే కలర్స్ సహజసిద్ధంగా అనిపిస్తాయి. ఈ ఫోన్ ద్వారా అవుట్ డోర్ లైటింగ్‌లో వీడియోలను షూట్ చేస్తున్నప్పుడు డిస్‌ప్లే బ్రైట్నెస్ లెవల్స్ కొంచం తగ్గుతున్నట్లు అనిపిస్తుంది.

 

కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్ 4జీబి ర్యామ్‌తో వస్తోంది...

కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్‌ను బీస్ట్ ఆఫ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ క్యాటగిరిగా కూల్‌ప్యాడ్ కంపెనీ అభివర్ణిస్తోంది. ఇందుకు కారణం 4జీబి ర్యామ్‌తో వస్తోన్న ఈ డివైస్ ధర కేవలం రూ.10,999 కావటమే. ఈ ఫోన్, మీ రోజువారి మల్టీమీడియా అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చగలదు.

ప్రాసెసర్..

ఫోన్ ప్రాసెసింగ్ డిపార్ట్‌మెంట్ విషయానికి వచ్చేసరికి, నోట్ 5 ఫోన్‌లో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. ఫోన్‌కు సంబంధించిన గ్రాఫికల్ టాస్క్‌లను ప్రాససర్‌కు జోడిగా పొందుపరిచిన అడ్రినో 405 జీపీయూ చూసుకుంటుంది.

కెమెరా విషయానికి వచ్చేసరికి

కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరాతో వస్తోంది. డీసెంట్ ఫోటోగ్రఫీని ఈ కెమెరా నుంచి ఆశించవచ్చు. ఫోన్ ముందు భాగంలో నిక్సిప్తం చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా ద్వారా సెల్ఫీలను షూట్ చేసుకోవచ్చు.

 

వేగవంతంగా స్పందించే ఫింగర్ ప్రింట్ స్కానర్

కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్, అత్యాధునిక ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తోంది. ఈ సెన్సార్ వ్యవస్థను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సెన్సార్ ఆధారంగా ఫోన్‌ను కేవలం 0.5 సెకన్ల వ్యవధిలో అన్‌లాక్ చేయవచ్చిన కంపెనీ చెబుతోంది.

ఇంటర్నల్ స్టోరేజ్‌..

కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఎస్డీ కార్డ్ ఇన్సర్ట్ చేసిన సమయంలో ఒక సిమ్ మాత్రమే పనిచేస్తుంది. యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్,

నాన్ రిమూవబుల్ బ్యాటరీతో...

కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్.. 4,010 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది. కంపెనీ చెబుతోన్న దాని ప్రకారం ఈ బ్యాటరీ 350 గంటల స్టాండ్ బై‌ అలానే 14 గంటల టాక్‌టైమ్‌ను ఆఫర్ చేయగలదు. 4G LTE అలానే VoLTE సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో జియో సిమ్ వాడుకోవచ్చు.

 

ఆండ్రాయిడ్ Marshmallow...

ఆండ్రాయిడ్ Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్ రన్ అవుతుంది. విత్ Cool UI Version 8.0 యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తుంది.ఈ యూజర్ ఇంటర్‌ఫేస్‌లో అందుబాటులో ఉంచిన డ్యుయల్ స్పేస్ ఫీచర్ ద్వారా ఫోన్ లో రెండు వేరు వేరు అకౌంట్‌లను ఏక కాలంలో నిర్వహించుకోవచ్చు. కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్ అక్టోబర్ 20 నుంచి అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Coolpad Note 5 First Impressions: The cheapest 4GB RAM smartphone in the market. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting