రూ.10,999కే బ్రాండెడ్ 4జీబి ర్యామ్ ఫోన్, నేటి అర్థరాత్రి నుంచి సేల్
బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో సరికొత్త సంచలనాలకు నాంది పలుకుతూ మార్కెట్లో లాంచ్ అయిన కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్ నేటి అర్థరాత్రి నుంచి మార్కెట్లో దొరుకుతుంది. Amazon Indiaక ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

Read More : ఈ రోజు నుంచే సేల్, రూ.1కే 'Redmi 3S Prime'
4జీబి ర్యామ్, 4జీ VoLTE సపోర్ట్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 4010 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ కెమెరా వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో వస్తోన్న ఈ ఫోన్ ధర కేవలం రూ.10,999 మాత్రమే. హై-ఎండ్ ఫోన్‌లతో సమానంగా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లోని ఆకట్టుకునే ఫీచర్లను ఇప్పుడు చూద్దాం...
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శక్తివంతమైన బ్యాటరీ..
కూల్‌ప్యాడ్ Note 5 ఫోన్ శక్తివంతమైన 4010 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. సింగ్ ఛార్జ్ పై 200 గంటల స్టాండ్ బై టైమ్‌ను ఆస్వాదించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ రిమూవబుల్ బ్యాటరీని సులువుగా రీప్లేస్ చేసుకునే వీలుంటుంది.

మల్టీ టాస్కింగ్ అదుర్స్
కూల్‌ప్యాడ్ Note 5 ఫోన్ ఏకంగా 4జీబి ర్యామ్‌తో వస్తోంది. 1.5గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. గ్రాఫిక్స్ భాగాన్ని ఆర్మ్ కార్టెక్స్ ఏ53 జీపీయూ చూసుకుంటుంది. ఈ విధమైన స్పెక్ కాంభినేషన్‌లో వస్తోన్న కూల్‌ప్యాడ్ Note 5లో మల్టీ టాస్కింగ్ అదరహో అనిపిస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

32జీబి ఇంటర్నల్ స్టోరేజ్..
కూల్‌ప్యాడ్ Note 5 ఫోన్‌లో ఏకంగా 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 64జీబి వరకు విస్తరించుకోవచ్చు.

ఫింగర్ ప్రింట్ స్కానర్
కూల్‌ప్యాడ్ Note 5 ఫోన్‌లో సెక్యూరిటీకి మరింత ప్రాధాన్యత కల్పిస్తూ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్‌ను ఏర్పాటు చేసారు. ఆధునిక సాఫ్ట్‌వేర్ పై స్పందించే ఈ స్కానర్ ద్వారా కేవలం 0.5 సెకన్ల వ్యవధిలో ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డ్యుయల్ స్పేస్ సిస్టం
కూల్‌ప్యాడ్ Note 5 డ్యుయల్ స్పేస్ సిస్టం సపోర్ట్‌తో వస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ రెండు వేరువేరు అకౌంట్‌లను ఫోన్‌లో నిర్వహించుకోచ్చు. వాట్సాప్, ఫేస్‌బుక్, మెసెంజర్ వంటి యాప్స్‌ను రెండేసి చప్పున మెయింటేన్ చేయవచ్చు.

జియో నెట్‌వర్క్ సపోర్ట్
కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్ 4జీ VoLTE సపోర్ట్‌తో వస్తోంది. ఈ ఫోన్ జియో నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కూల్‌ప్యాడ్ నోట్ 5 పూర్తి స్పెసిఫికేషన్స్...
2.5డి కర్వుడ్ గ్లాస్‌తో కూడిన 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1920×1080పిక్సల్స్, 4జీబి ర్యామ్, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్, అడ్రినో 405 జీపీయూ , 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 4,010 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై కూల్‌ప్యాడ్ నోట్ 5 ఫోన్ రన్ అవుతుంది. విత్ Cool UI Version 8.0 యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








