ఆకట్టుకునే ఫీచర్లతో Coolpad Note 6,బడ్జెట్ ధరలో..

Written By:

చైనా మొబైల్ తయారీ దిగ్గజం కూల్‌ప్యాడ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోట్ 6 ను తాజాగా ఇండియాలో విడుదల చేసింది. ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్ ఇండియా మార్కెట్లోకి ఎంటరయింది. ఇందులో 5.5 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 8, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. వీటికి ఫ్లాష్ సదుపాయం ఉంది. వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫోన్ ముందు భాగంలో హోమ్ బటన్ కింద ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.

ఆకట్టుకునే ఫీచర్లతో Coolpad Note 6,బడ్జెట్ ధరలో..

ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను అమర్చారు. 4070 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఇందులో ఏర్పాటు చేయడం వల్ల బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుంది. కేవలం గోల్డ్ రంగులో మాత్రమే విడుదలైన ఈ ఫోన్ 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.8,999, రూ.9,999 ధరలకు వినియోగదారులకు లభ్యమవుతున్నది.

కూల్ ప్యాడ్ నోట్ 6 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4070 ఎంఏహెచ్ బ్యాటరీ.

జియో 8జిబి డేటా ఉచితం,ఎటువంటి పరిమితులు లేవు !

ఈ ఫోన్ లాంచ్ సంగతి అలా ఉంచితే కూల్‌ప్యాడ్, లీఎకో సంస్థలు కలిసి కూల్ 2 పేరిట మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నాయి. ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా ఈ కంపెనీలు వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందివ్వనున్నారు. గతంలో కూల్ 1 అనే స్మార్ట్‌ఫోన్‌ను ఈ రెండు కంపెనీలే సంయుక్తంగా తయారు చేసి విడుదల చేసిన విషయం విదితమే.

ఆకట్టుకునే ఫీచర్లతో Coolpad Note 6,బడ్జెట్ ధరలో..

కూల్‌ప్యాడ్ కూల్ 2 ఫీచర్లు
5.7 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13, 0.3 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary
Running Android 7.1 Nougat, Coolpad Note 6 is powered by a Qualcomm Snapdragon 435 chipset and is fuelled by 4,070 mAh battery.More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot