Jio నుంచి త్వ‌ర‌లో రాబోయే 5G మొబైల్ ధ‌ర తెలిస్తే షాక‌వుతారు!

|

భార‌త ప్ర‌ముఖ టెలికాం కంపెనీ రిల‌య‌న్స్ జియో వీలైనంత తొంద‌ర‌గా JioPhone 5G మొబైల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రాబోయే మొబైల్ ధ‌ర‌కు సంబంధించి ఇప్ప‌టికే ప‌లు రూమ‌ర్లు ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి. లాంచ్ త‌ర్వాత ఈ JioPhone 5G ధ‌ర దాదాపు రూ.8వేల నుంచి రూ.12 వేల మ‌ధ్య‌ ఉండే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు కౌంట‌ర్ పాయింట్ నివేదిక ఈ రాబోయే హ్యాండ్‌సెట్ తాలూకు ప‌లు వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

 
Jio

ఈ మొబైల్ విభిన్న స్క్రీన్ సైజులు, స్పెసిఫికేష‌న్ల‌తో పాటుగా.. విభిన్న వేరియంట్లలో రానుంద‌ని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, ఇది హోల్ పంచ్ డిస్‌ప్లే డిజైన్ క‌లిగి ఉంటుందని వెల్ల‌డించింది. దీని ధ‌ర ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకునే విధంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ మొబైల్ ఫోన్ అప్‌డేటెడ్‌, ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది.

 

JioPhone 5G ధ‌ర ఎంతంటే(రూమ‌ర్ల ప్ర‌కారం):
కౌంట‌ర్ పాయింట్ ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం ప‌లు వివ‌రాలు ఇలా ఉన్నాయి. రాబోయే JioPhone 5G ధర రూ.8,000 నుంచి రూ.12,000 ఉండే అవ‌కాశం ఉంది. భార‌త మార్కెట్లో 4G స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా Jio తన 5G స్మార్ట్‌ఫోన్ ను ప్రారంభించ‌నున్న‌ట్లు నివేదిక‌ల స‌మాచారం.

Jio

JioPhone 5G స్పెసిఫికేషన్లు (రూమ‌ర్ల ప్ర‌కారం):
రిలయన్స్ జియో నుండి 5జీ హ్యాండ్‌సెట్ ప‌లు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని ఇదువ‌ర‌కు వ‌చ్చిన నివేదికలు సూచిస్తున్నాయి. స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.5-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్స్) IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. JioPhone 5G ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్)లో రన్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఫోన్ కనీసం 4GB RAMతో పాటు octa-core Qualcomm Snapdragon 480 SoCని కలిగి ఉంటుందని స‌మాచారం.

JioPhone 5Gలో కనీసం 32GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటుందని రూమ‌ర్లు వెల్ల‌డించాయి. ఇక ఫోటోలు మరియు వీడియోల విష‌యానికొస్తే.. JioPhone 5G మొబైల్ బ్యాక్‌సైడ్‌ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మ‌రియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ లెన్స్‌ కలిగి ఉంటుంది. JioPhone 5Gలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు వైపున‌ 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను జియో అందిస్తుందని చెప్పబడింది.

ఈ మొబైల్‌లో స్టోరేజీని మైక్రో SD కార్డ్ ద్వారా ప్రత్యేక స్లాట్ ద్వారా విస్త‌రించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G VoLTE, Wi-Fi 802.11 a/b/g/n, బ్లూటూత్ v5.1, GPS/ A-GPS/ NavIC మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుందని చెప్పబడింది. ఇంకా, JioPhone 5G మొబైల్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Jio

దీపావ‌ళి నుంచి దేశంలో Jio 5G సేవ‌లు షురూ!
భార‌త‌దేశంలో అతిపెద్ద టెల్కో అయిన‌ Jio యొక్క 5G సేవ‌ల‌కు సంబంధించి రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేశారు. అతి త్వ‌ర‌లోనే వినియోగ‌దారుల‌కు 5జీ సేవ‌ల‌ను అందుబాటులోకి తెస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. దీపావళి నుంచి దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న రిలయన్స్ 45వ వార్షిక సాధార‌ణ స‌మావేశం(AGM 2022)లో భాగంగా ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

AGM 2022 లో చెప్పిన ప్ర‌కారం:
ఈ దీపావళి నాటికి ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో జియో 5G అందుబాటులోకి రానుందని అంబానీ ప్ర‌క‌టించారు. డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా జియో 5G అందుబాటులోకి రానుంది. ఇందుకోసం రూ.2ల‌క్ష‌ల కోట్లు వెచ్చిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. జియో దేశవ్యాప్తంగా 3.3 మిలియన్ చదరపు కిలోమీటర్ల జియో ఫైబర్ నెట్‌వర్క్‌ను కూడా అందిస్తుందని తెలిపారు.

Best Mobiles in India

English summary
Counter point reaserch says JioPhone 5G price in india set between Rs.8000 to Rs.12000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X