క్రేజీ కుర్రకారు!!

|

సాంకేతిక పరిజ్ఞానం మరింత ఆధునీకతను సంతరించుకుంటున్న నేపధ్యంలో ఫీచర్ ఫోన్‌ల స్థానాన్ని స్మార్ట్‌ఫోన్‌లు భర్తీ చేస్తున్నాయి. ఈ స్మార్ట్ గ్యాడ్జెట్‌లు కేవలం కమ్యూనికేషన్ అవసరాలనే కాకుండా విద్య, వ్యాపార ఇతర వినోదాత్మక వనరులను సమకూరుస్తున్నాయి. ఇన్ని ప్రతిభలు కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను పలువురు నిర్థిష్ట పనులకు మాత్రమే వినియోగిస్తుంటే. మరి కొందరు మాత్రం సాంకేతికతను అడ్డుపెట్టుకుని సమాజాన్ని తప్పుదోవ పట్టించే చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ పక్రియ ఆ క్షణంలో ఆనందాన్ని కలిగించినప్పటికి మితి మీరితే మాత్రం ఏరికోరి ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లే.

 క్రేజీ కుర్రకారు!!

స్మార్ట్‌ఫోన్‌ల సాయంతో పలువురు విద్యార్థులు చీప్‌ట్రిక్‌లకు పాల్పడుతున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్‌ఫోన్‌లను తీసుకెళ్లి డివైజ్‌కు అనుసంధానించబడిన డేటా కనెక్టువిటీ సాయంతో జవాబులు రాబడుతూ, సునాయాసంగా కాపీలకు పాల్పడుతున్నారు. పట్టబడితే మాత్రం కేరీర నాశనమైపోతుంది.

ఆధునిక హంగులతో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌ల డెస్క్‌టాప్ బ్రౌజింగ్‌కు అనువుగా ఉండటంతో పలువురు ఎడతెరిపి లేకుండా ఆశ్లీల క్లిప్పింగ్‌లను చూస్తున్నారు. ఈ చర్యకు ఏకాంత సమయంలో ప్రాధాన్యతనివ్వటం మంచిది. మితిమీరిని వినియోగంతో ఇతరుల కంటపడితే చులకనకావల్సిందే.

స్మార్ట్‌ఫోన్‌లలో ఏర్పాటు చేసే ఫ్రంట్ కెమెరాల ద్వారా యూజర్ స్వయంగా తనను తాను నచ్చిన శైలిలో చిత్రీకరించుకోవచ్చు. ఈ సౌలభ్యతను పలువురు దుర్వినియోగం చేస్తూ లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. రెచ్చగొట్టే భంగిమల్లో ఫోటోలు దిగి వాటిని సీక్రెట్ ఫోల్డర్లలలో భద్రపరుచుకోకుండా సాధారణ ఫోల్డర్‌లలో సేవ్ చేస్తున్నారు. ఈ చర్య ప్రమాదకరం.

అందుబాటులో ఉన్నపరిజ్ఞానాన్ని పలువురు ఆకతాయిలు ఆసరాగా తీసుకుని ఇతరుల ఫోన్‌లకు ఆశ్లీల, అభ్యంతరకర సందేశాలను ఫోటోలు ఇంకా ఈ-మెయిల్స్ రూపంలో పంపిస్తుంటారు. ఈ చర్య చట్టరిత్యా నేరం అంతేకాకుండా అవతలి వ్యక్తి మనోభావాలను దెబ్బతీస్తుంది. పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవు.

చాలా మంది డ్రైవింగ్ చేస్తూనే ఫోన్‌ల ద్వారా ఇతర వ్యక్తులతో సంభాషించటంతో పాటు ఇతరత్రా చర్యలకు పాల్పడుతుంటారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఏకాగ్రత తప్పనిసరి. ఈ సమయంలో ఫోన్ ఏకాగ్రతను మరల్చటంతో పాటు ప్రమాదాలకు తావుతీస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X