డేటా‌విండ్ నుంచి చవక ధర డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

భారతీయులకు చవక ధర ఆకాష్ టాబ్లెట్‌‌లను పరిచయం చేసిన డేటావిండ్ కంపెనీ మూడు తక్కువ ధర డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ హ్యాండ్‌సెట్‌లు 5 అంగుళాల స్ర్కీన్ సైజులను కలిగి అతితక్కువ ధరల్లో లభ్యమవుతాయని డేటావిండ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీత్ సింగ్ తులీ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు రూ 3,500 నుంచి రూ 6,500 మధ్య ఉంటాయని సునీత్ సింగ్ తెలిపారు.

 
డేటా‌విండ్ నుంచి చవక ధర డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు

దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్, మైక్రోమాక్స్, కార్బన్ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు 60శాతం మార్కెట్‌ను వసం చేసుకున్నట్లు ఓ అంచనా. ముఖ్యంగా భారతీయులు 5 అంగుళాల స్ర్కీన్‌లను కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల పట్ల మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డేటావిండ్ ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు....

పాకెట్ సర్ఫర్ 5ఎక్స్:

డ్యూయల్ సిమ్, లైనుక్స్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల రెసిస్టివ్ టచ్ స్ర్కీన్ , ధర రూ.3,499

పాకెట్ సర్ఫర్ 5:

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, ధర రూ.4,999

పాకెట్ సర్ఫర్ 3జీ5:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.2ఎన్ ఆపరేటింగ్ సిస్టం, ధర రూ.6,499.

ఫోన్ల మార్కెట్లో పోటీ ఎక్కువై మార్జిన్లు క్షీణిస్తున్న నేపథ్యంలో దేశీయ మొబైల్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా టాబ్లెట్ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తున్న టాబ్లెట్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే తరుణంలో ఈ మార్కెట్‌ను క్యాప్చర్ చేయాలని కంపెనీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే డేటావిండ్ కంపెనీ చవక ధరలో ఆకాష్ ట్యాబ్లెట్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. మైక్రోమాక్స్, లావా, కార్బన్, ఐబాల్ వంటి కంపెనీలు చవక ధరల్లో టాబ్లెట్ లను ఆఫర్ చేస్తున్నాయి.

ఈ కంపెనీలు అందిస్తున్న టాబ్లెట్‌ల ధరలు రూ.5,000 నుంచి రూ.7,000 మధ్య ఉన్నాయి. టాబ్లెట్ సగటు ధర స్మార్ట్‌ఫోన్లతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నందు వల్ల ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. ఇదే కంపెనీల లాభాలను పెంచుకోవడానికి దోహదపడుతోంది. కేవలం టాబ్లెట్లను తీసుకురావడమే కాకుండా విభిన్న రకాల కస్టమర్లను ఆకట్టుకునే విధంగా కంటెంట్‌ను కూడా డెవలప్ చేయాలని కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. విద్యార్థులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు, సాధారణ వినియోగదారుల అవసరాలను గుర్తించి కంటెంట్‌ను అభివృద్ధి చేస్తున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X