డెల్, బైదు కలిశాయి, ఇక 'దే తడీ పోచమ్ గుడే'..

By Super
|
Dell and Baidu
ప్రముఖ లాప్ ట్యాప్ సంస్ద డెల్, చైనా సెర్చ్ ఇంజన్ గెయింట్ బైదు ఇద్దరి భాగస్వామ్యంలో ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో కెల్లా చైనాలో 900 మిలియన్ జనాభా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉండడమే కాకుండా టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్, హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్‌కి మంచి గిరాకీ ఉంది. డెల్, బైదు రెండింటి భాగస్వామ్యం ఆపిల్ లాంటి కంపెనీలకు మింగుడు పడని విషయం. నవంబర్ మొదటి వారం కల్లా మొబైల్ మార్కెట్లోకి డివైజెస్‌ని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ రెండింటి భాగస్వామ్యం గురించిన సమాచారం డెల్ సంస్దని ప్రశ్నించగా దీనిపై స్పందించడానికి నిరాకరించింది.

ఇది ఇలా ఉంటే ఇటీవలే బీజింగ్‌లో చైనా టాప్ సెర్ట్ ఇంజన్ గెయింట్ 'బైదు' శుక్రవారం మార్కెట్లోకి కొత్త మొబైల్ అప్లికేషన్‌ సిస్టమ్‌ని విడుదల చేసింది. బైదు ఈ అప్లికేషన్‌ని మార్కెట్లోకి విడుదల చేయడానికి కారణం ప్రస్తుతం మొబైల్ ఆప్లికేషన్‌లో నెంబర్ వన్ స్దానంలో కొనసాగుతున్న ఆలీబాబా గ్రూప్‌కి గట్టి పోటీ ఇవ్వడానికేనని నిపుణులు తమ అభిప్రాయాన్ని తెలిపారు. బైదు విడుదల చేసిన మొబైల్ అప్లికేషన్ ప్లాట్ ఫామ్ పేరు బైదు వైఐ. దీని ముఖ్య ఉపయోగం ఏమిటంటే మూడవ పార్టీ డవలపర్స్ క్రియేట్ చేసిన అప్లికేషన్స్ గేమ్స్, మ్యాప్స్, టూల్స్ లాంటి వైఐ స్టోర్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. యాపిల్ కంపెనీ ప్రవేశపెట్టిన యాపిల్ స్టోర్ మాదిరి లాగా ఇది పని చేస్తుందన్నమాట.

బైదు వైఐ గూగుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఆధారం చేసుకొని రూపోందించడం జరిగింది. ఇక బైదు గురించి చర్చించుకుంటే చైనాలో సెర్చ్ ఇంజన్ గెయింట్స్ లో అతి పెద్దది మాత్రమే కాకుండా చైనా షేర్ మార్కెట్లో 80శాతం వాటాని సొంతం చేసుకుంది. వీటితో పాటు ఈ కామర్స్, ఆన్ లైన్ వీడియో, ఆన్ లైన్ ట్రావెల్ లాంటి వాటన్నింటిని అనుసంధానం చేయడం జరిగింది. చైనా ఇంటర్నెట్ సంస్దలు, టెల్కో గేర్ తయారీ దారులు ఎవరికి వారు సొంతంగా మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఒక్క చైనాలోనే మాత్రమే కాకుండా భారత్, బంగ్లాదేశ్ లాంటి దేశాలలో కూడా తమ ఉత్పత్తలను విక్రయిస్తున్నారు.

డెల్, బైదు భాగస్వామ్యంలో విడుదల చేయనున్న మొబైల్ ఫోన్స్‌లలో బైదు ఆపరేటింగ్ సిస్టమ్‌నే వాడనున్నారు. చైనాలో ఉన్న ఆలీబాబా గ్రూప్ ఆలియున్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత K-Touch W700 మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మొబైల్ ఫోన్స్ క్లౌడ్ కంప్యూటింగ్‌‌ని సపోర్ట్ చేయడంతో చైనా రీజియన్లో బాగా పాపులర్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం చైనా మొబైల్ మార్కెట్లో ఆపిల్, లెనోవా డామినేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త మొబైల్స్ రావడంతో మార్కెట్లో గట్టి పోటీ వాతావరణం ఏర్పడుతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X