డెల్ కస్టమర్ల ఆనందం వెనుక..?

కంప్యూటింగ్ అవసరాలను తీర్చటంలో విశ్వవ్యాప్తంగా సఫలీకృతమైన ‘డెల్’, గతంలో విడుదల చేసిన డెల్ స్ట్రీక్ 5 టాబ్లెట్ మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్‌కు శ్రీకారం చుట్టింది. కాంపాక్ట్ సైజులో మల్టీ పర్సస్ అవసరాల కోసం డిజైన్ కాబడిన స్ట్రీక్ 5 అత్యధికంగా అమ్ముడుపోయింది. ఇక పై ‘డెల్ స్ట్రీక్ 5’ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ కానుంది. ఈ తాజా అప్‌డేట్ సైజు 155 ఎంబీ. xda డెవలపర్స్ టీమ్ ఈ నవీకరణను వృద్ధి చేశారు.
డెల్ తీసుకున్న నిర్ణయం పట్ల ‘డెల్ స్ట్రీక్ 5’ కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్‌డేట్ తమ డివైజ్‌కు వర్తించేందుకు గాను వాడకందారులు అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవల్సి ఉంది. లేని పక్షంలో డెల్ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్‌డేట్ సమయంలో డివైజ్‌లోని డేటాను బ్యాకప్ చేసుకోవటం ఉత్తమం.
తాజాగా ఈ ప్రఖ్యాత బ్రాండ్ ‘డెల్ స్ర్టీక్ 7’ వర్షన్‌లో టాబ్లెట్ మొబైల్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింట్ సిస్టం పై ఈ డివైజ్ రన్ అవుతుంది.


Click it and Unblock the Notifications








