డెల్ ‘న్యూ ఇయర్’ ప్లాన్ ఏంటి..?

Posted By: Super

డెల్ ‘న్యూ ఇయర్’ ప్లాన్ ఏంటి..?

 

కొత్త సంవత్సరం.. కొత్త ఆవిష్కరణతో ప్రత్యర్థులకు ఘులక్ ఇచ్చేందకు డెల్ (Dell) సిద్ధమైంది. ఈ బ్రాండ్ డిజైన్ చేసిన  స్మార్ట్ ఫోన్ ‘స్ర్టీక్ ప్రో  101DL’ జనవరిలో విడుదలకు సన్నాహాలు పూర్తయ్యాయి.  ఈ డివైజ్ బరువు కేవలం 140 గ్రాములు. జీఎస్ఎమ్ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది. మిగిలిన ముఖ్య ఫీచర్లు క్లుప్తంగా...

గుగూల్ ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ రన్ అవుతుంది.  1.5 GHz సామర్ధ్యం గల డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్ ను సిస్టంలో నిక్షిప్తం చేశారు. మొబైల్ లో గ్రాఫిక్ వ్యవస్థను పటిష్టపరుస్తూ  క్వాల్కమ్ అడిర్నో 220 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఇన్ బుల్ట్ చేశారు. 3జి ఇంటర్నెట్ వ్యవస్థను పోన్ సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నెట్ కనెక్టువిటీ వేగాన్ని రెట్టింపు చేసే విధంగా డివైజ్ లో  జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై  వ్యవస్థలను నిక్షిప్తం చేశారు.  720 పిక్సల్ సామర్ధ్యం గల హై డెఫినిషన్ వీడియోలను  స్మార్ట్ ఫోన్ లో ప్లే చేసుకోవచ్చు.

డిస్ ప్లే పరిమాణం 4.3 అంగుళాలు, మల్టీ టచ్ సౌలభ్యత,  LP DDR2 SD ర్యామ్ వ్యవస్థ,  రోమ్ సామర్ధ్యం 7630 ఎంబీ,  ఎక్స్ ప్యాండబుల్ విధానం ద్వారా సిస్టం జీబిని 32కు పెంచుకోవచ్చు. ఫోన్ ప్రైమరీ కెమెరా సామర్ధ్యం 8 మెగా పిక్సల్, సెకండరీ కెమెరా సామర్ధ్యం 1.3 మెగా పిక్సల్. లయోన్ 1520 mAh బ్యాటరీ మన్నికైన బ్యాకప్ నిస్తుంది. ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot