బ్లాక్‌బెర్రీకి చుక్కెదురు.. వారంటీ పెంచేందుకు సానుకూలం?

Posted By: Staff

బ్లాక్‌బెర్రీకి చుక్కెదురు.. వారంటీ పెంచేందుకు సానుకూలం?

 

బ్లాక్‌బెర్రీ  తయారీదారు రిసెర్చ్ ఇన్ మోషన్ మరో సారి సమస్యల్లో ఇరుక్కున్నట్లు ప్రముఖ కెనడీయన్ వెబ్‌సైట్ పేర్కొంది. ఇటీవల కాలంలో  రిమ్ విడుదల చేసిన ‘బోల్డ్ 9900’ స్మార్ట్‌ఫోన్‌లలో కీప్యాడ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని వినియోగదారులను నుంచి పెద్ద సంఖ్యలో  ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామంతో  అమ్మకాల గణనీయంగా  పడిపోయాయని బ్లాక్‌బెర్రీ విక్రయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

వైఫల్యానికి గల కారణాలను వివరిస్తూ బెర్రీ వర్గాలు ఓ ప్రకటనను జారీచేశాయి. గత ఏడాది నవంబరు 13 మందు డిజైన్ చేసిన వాటికి మాత్రమే ఈ సమస్య తెలెత్తిందని అందుకు చింతిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. కీప్యాడ్ అమరికలో లోపాలు తలెత్తటంతోనే సమస్య ఉత్పన్నమైందని అందుకు గల కారణాలను కూలంకుషంగా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో హ్యాండ్ సెట్’ పూచికత్తు (వారంటీ) సమయాన్ని మరో 18 నెలలు పాటు పొడిగిస్తున్నట్లు పక్రటించింది. ఈ వైఫ్యలం బ్లాక్‌బెర్రీ విశ్వసనీయతకు విఘాతం కలిగించేదిగా భావించవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot