Home
Mobile

అత్యంత తక్కువ ధరకే దేశీయ మొబైల్

అత్యంత తక్కువ ధరలో మొబైల్స్ లాంచ్ చేస్తూ దూసుకుపోతున్న దేశీయ దిగ్గజం డీటెల్ అత్యంత చవకైన ధరలో మరో ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసి సంచలనం సృష్టించింది.

By Hazarath Aiah

అత్యంత తక్కువ ధరలో మొబైల్స్ లాంచ్ చేస్తూ దూసుకుపోతున్న దేశీయ దిగ్గజం డీటెల్ అత్యంత చవకైన ధరలో మరో ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసి సంచలనం సృష్టించింది. రూ.299కే డీటెల్ 1 పేరుతో బేసిక్ మోడ్ ఫోన్ ను లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో డి 1 స్లిమ్' పేరుతో అతి తక్కువ ధరలో ఒక ఫీచర్‌ఫోన్‌ను సోమవారం విడుదల చేసింది. 'డీ1కు సక్సెసర్‌గా తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ఫోన్‌లో డిజిటల్‌ కెమెరా విత్‌ఎల్‌ఈడీ ఫ్లాష్‌ ప్రత్యేకతగా కంపెనీ చెబుతోంది. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు, డిజైన్‌తో డీ1స్లిమ్‌ ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లో కొత్త ఒరవడిని సృష్టించనుందని డీటెల్‌ఎండీ యోగేష్‌ భాటియా తెలిపారు.

B2BAdda.com ద్వారా..

B2BAdda.com ద్వారా..

ఆసక్తిగల కొనుగోలు దారులు B2BAdda.com ద్వారా ఈ ఫీచర్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

2.8 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 16 జీబికి స్టోరేజ్‌ విస్తరణ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విస్తరించగల సామర్ధ్యం ఈ ఫోన్‌లో జోడించింది.

ధర 1199 రూపాయలు.

ధర 1199 రూపాయలు.

బ్లూ, గోల్డ్‌, పింక్‌ - మూడు కలర్ వేరియంట్లలో లభించనుంది. ఈ ఫీచర్‌ ఫోన్‌ ధర 1199 రూపాయలు.

రూ. 299లకే డీ1 ఫీచర్‌ఫోన్‌

రూ. 299లకే డీ1 ఫీచర్‌ఫోన్‌

గతంలో రూ. 299లకే డీ1 ఫీచర్‌ఫోన్‌ తీసుకొచ్చిన కంపెనీ భారతదేశంలో అతి తక్కువ విలువైన మొబైల్ ఫోన్ తమదే అని కంపెనీ పేర్కొంది.

బీఎస్‌ఎన్‌ఎల్ డీటెల్ సంస్థతో భాగస్వామ్యమై..

బీఎస్‌ఎన్‌ఎల్ డీటెల్ సంస్థతో భాగస్వామ్యమై..

కాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) డీటెల్ సంస్థతో భాగస్వామ్యమై రూ.499కే 'డీటెల్ డీ1' పేరిట విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

రూ.153 టారిఫ్ ప్లాన్‌..

రూ.153 టారిఫ్ ప్లాన్‌..

బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌తోపాటు రూ.153 టారిఫ్ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్నది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రూ.103 టాక్‌టైం లభిస్తుంది.

365 రోజులు..

365 రోజులు..

బీఎస్‌ఎన్‌ఎల్ టు బీఎస్‌ఎన్‌ఎల్ కాల్స్‌కు నిమిషానికి 15 పైసలు చార్జి చేస్తారు. అలాగే ఇతర ఆపరేటర్ కాల్స్‌కు నిమిషానికి 40 పైసలు చార్జి పడుతుంది. ఇక ఈ ప్లాన్‌కు వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు. దీంతో సంవత్సరం పాటు ఈ ప్లాన్‌ను వాడుకోవచ్చు.

డీటెల్ డీ1 ఫోన్‌లో.

డీటెల్ డీ1 ఫోన్‌లో.

డీటెల్ డీ1 ఫోన్‌లో 1.44 ఇంచ్ మోనోక్రోమ్ డిస్‌ప్లే, ఫిజికల్ కీప్యాడ్, సింగిల్ సిమ్ స్లాట్, 650 ఎంఏహెచ్ బ్యాటరీ, టార్చి లైట్, ఫోన్‌బుక్, ఎఫ్‌ఎం రేడియో, లౌడ్ స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Detel D1 Slim feature phone launched in India, priced at Rs 1199 more news at gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X