‘స్లగ్’ డౌన్‌లోడ్ కాని ఫైళ్లను రికార్డ్ చేస్తుంది..?

Posted By: Staff

‘స్లగ్’ డౌన్‌లోడ్ కాని ఫైళ్లను రికార్డ్  చేస్తుంది..?

 

మీకు అత్యవసరంగా ఆడియో లేదా సౌండ్ ట్రాక్ కావల్సివచ్చింది. నెట్‌లో బ్రౌజింగ్ మొదలుపెడతారు, అంతిమంగా ఆ  మ్యూజిక్ ఫైల్ మీకు దొరుకుతుంది. కానీ ఆ ఫైల్ వినేందుకు మాత్రమే, డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఛాన్స్ లేదు.  ఆ పరిస్ధితిలో  రికార్డింగ్ ఒక్కటే  ఒకటే మార్గం.  సాధారణ పీసీలలో ఏర్పాటు చేసే మైక్రోఫోన్  వ్యవస్థ  మన్నిక తక్కువైనదిగా ఉంటుంది. హై సెన్సిటివిటీ సామర్ధ్యం గల మైక్రో‌ఫోన్ ఒక్కటి ఖచ్చితమైన రికార్డింగ్‌కు ఉపకరిస్తుంది.

ఈ తరహా హై క్వాలిటీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న చిన్న పరికరమే ‘స్లగ్’(SLUG), సౌండ్ ఇంజనీరింగ్‌లో నిపుణులైన  కిన్నెట్గ్ గిబ్స్, సీనా జందీపౌర్‌లు ఈ గ్యాడ్జెట్‌ను రూపొందించారు. డౌన్‌లోడ్‌కు సాధ్యంకాని స్ట్ర్రీమింగ్ సౌండ్ ఫైళ్లను అదే తరహా నాణ్యతతో స్లగ్ రికార్డ్ చేసుకుంటుంది.

రికార్డింగ్ ప్రక్రియలో భాగంగా ఈ గాడ్జెట్లో   రెండు 3.5 mm వ్యవస్ధలను ఏర్పాటు చేశారు. రికార్డింగ్ సందర్భంలో ఒక జాక్‌ను కంప్యూటర్ లేదా ఇతర ఎలక్ట్ర్రానిక్ డివైజ్ హెడ్‌పోన్ పోర్టుకు అనుసంధానం చేయాలి, మరో జాక్‌ను మైక్రోఫోన్ పోర్టుకు జత చేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వార  హైడ్ ఫోన్ పోర్టు  నుంచి వెలువడిన మ్యూజిక్ ఫైళ్లు  మైక్రోఫోన్ పోర్టులోకి చేరి రికార్డ్ కాబడతాయి. అతిత్వరలో భారతీయ మార్కెట్లో విడుదల కాబోతున్న ‘స్లగ్’ ఆడియో రికార్డింగ్ గ్యాడ్జెట్ ధర రూ. 15,00.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting