స్మార్ట్‌పోన్ వాడేవారు షాకయ్యే న్యూస్ ఏంటో తెలుసా ?

స్మార్ట్‌ఫోన్ల‌నేవి నేడు మ‌న నిత్య జీవితంలో భాగం అయిపోయాయి. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు వాటితోనే చాలా మంది కాల‌క్షేపం చేస్తున్నారు.

|

స్మార్ట్‌ఫోన్ల‌నేవి నేడు మ‌న నిత్య జీవితంలో భాగం అయిపోయాయి. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు వాటితోనే చాలా మంది కాల‌క్షేపం చేస్తున్నారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా కొంద‌రు మాత్రం స్మార్ట్‌ఫోన్ల‌ను ఏకంగా టాయిలెట్ల‌లో కూడా వాడుతున్నారు. అవును, చాలా మంది ఇలా చేస్తున్నారు. అయితే నిజానికి ఇలా చేయ‌డం చాలా హానిక‌ర‌మ‌ట‌. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయని డాక్ట‌ర్లు చెబుతున్నారు.స్మార్ట్‌ఫోన్స్‌ కొన్ని వందల రకాల బ్యాక్టీరియాలకు, సూక్ష్మజీవులకు స్మార్ట్‌ నిలయాలుగా మారుతున్నాయి. అది కూడా టాయిలెట్‌లో ఉండే క్రీములకంటే దారుణమైన క్రీములని చెబితే తట్టుకోగలరా కానీ, ఇది నిజం. మ‌రి స్మార్ట్‌ఫోన్ల‌ను టాయిలెట్ల‌లో ఎందుకు వాడ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా..!

 

షియోమి సరికొత్త ఎత్తుగడ, ఇండియాలో 50 వేల ఉద్యోగాలు, ఏపీలో ప్లాంటుషియోమి సరికొత్త ఎత్తుగడ, ఇండియాలో 50 వేల ఉద్యోగాలు, ఏపీలో ప్లాంటు

టాయిలెట్లోకి స్మార్ట్‌ఫోన్ల‌ు..

టాయిలెట్లోకి స్మార్ట్‌ఫోన్ల‌ు..

టాయిలెట్ల‌లో స‌హ‌జంగానే క్రిములు భారీ సంఖ్య‌లో ఉంటాయి. ఈ క్ర‌మంలో టాయిలెట్‌లోకి ఫోన్‌ను తీసుకెళ్లే దానిపై పెద్ద ఎత్తున బాక్టీరియా, వైర‌స్‌లు చేరుతాయి. దీంతో అవి ఫోన్‌పై అలాగే ఉంటాయి. ఇక అవి అక్క‌డి నుంచి మ‌న చేతుల‌కు, అక్క‌డి నుంచి నోట్లోకి, అనంత‌రం క‌డుపులోకి వెళ్తాయి. ఇంకేముందీ ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తాయి. అది రోగాల‌కు దారి తీస్తుంది. క‌నుక టాయిలెట్లోకి స్మార్ట్‌ఫోన్ల‌ను తీసుకెళ్ల‌రాదు.

27 హ్యాండ్‌ సెట్లపై పరీక్షలు

27 హ్యాండ్‌ సెట్లపై పరీక్షలు

పుణెకు చెందిన ఒక సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో స్మార్ట్‌‌ఫోన్‌లో వేలాది క్రిములు నివసిస్తున్నాయని వెల్లడైంది. గతంలోనే స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా క్రిములు ఉన్నాయన్న వార్తలు రావడంతో 27 హ్యాండ్‌ సెట్లపై పరీక్షలు నిర్వహించారు. ఇందులో బయటపడ్డ విషయం ఏమిటంటే బాత్‌ రూంలో కంటే స్మార్ట్‌ ఫోన్లలోనే ఎక్కువగా క్రిములు ఉన్నట్లు వెల్లడైంది.

500 రకాల బాక్టీరియాలతో పాటు..
 

500 రకాల బాక్టీరియాలతో పాటు..

500 రకాల బాక్టీరియాలతో పాటు 30 కరాల ఫంగస్‌ లు ఉన్నట్టు తేలింది. గతంలోనూ యూకేలో జరిగిన ఒక అధ్యయనంలో టాయిలెట్ల కంటే మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్‌ కీ బోర్డులపై ఎక్కువగా క్రిములు వుంటాయని వెల్లడైంది.

 

 ఎటువంటి మందులు ప్రయోగించినా..

ఎటువంటి మందులు ప్రయోగించినా..

ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ క్రిములు ఎటువంటి మందులు ప్రయోగించినా నిర్మూలన కాకపోవడం విశేషం. స్మార్ట్‌ ఫోన్ల నుంచి క్రిములను పూర్తిగా తొలగించలేమని ఫోన్‌ ను స్విచాఫ్‌ చేసి కొద్దిగా సోప్‌ నీరు కలిపిన గుడ్డతో శుభ్రం చేయడం ద్వారా బాక్టీరియా ఎక్కువగా వ్యాపించకుండా నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

మూడు కొత్త సూక్ష్మక్రిముల జాతులు

మూడు కొత్త సూక్ష్మక్రిముల జాతులు

పుణె శాస్త్రవేత్తలు మూడు కొత్త సూక్ష్మక్రిముల జాతులు మొబైల్ ఫోన్లలో ఉన్నట్టు కనుగొన్నారు. లైసిన్‌బసిల్లాస్ టెలిఫోనికస్, మైక్రోబ్యాక్టీరియమ్ టెలిఫోనికమ్ అనే బ్యాక్టీరియాలు, పైరెనొచేట టెలిఫోని అనే శిలీంధ్రాన్ని కనుకొన్నారు.అయితే వీటిలో చాలా సూక్ష్మక్రిముల వల్ల మనుషులకు ఎలాంటి హాని జరుగదని వారు పేర్కొన్నారు.

మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ కీ బోర్డులపైనే ..

మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ కీ బోర్డులపైనే ..

కాగా బాత్రూంలో కంటే మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ కీ బోర్డులపైనే క్రిములు ఎక్కువగా ఉంటాయని గతంలో బ్రిటన్‌లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

Best Mobiles in India

English summary
Did you know that your smartphone holds 20 times as many bacteria More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X