Home
Mobile

దీపావళి ప్రత్యేక సేల్‌ 2024.. రూ.10,000 కంటే తక్కువ ధరలో బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌లు.. పూర్తి వివరాలు..!

దీపావళి సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు, ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలు ప్రత్యేక సేల్‌లు నిర్వహిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా ఫ్లాగ్‌షిప్‌ సహా మిడ్‌రేంజ్‌, ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌ హ్యాండ్‌సెట్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. అయితే భారత్‌లో ఎక్కువ సంఖ్యలో రూ.10000 కంటే తక్కువ ధర స్మా్ర్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం అదే ధరలో అనేక బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన కెమెరా ఫీచర్‌లు, డిజైన్‌ సహా డిజైన్, స్టోరేజీని కలిగి ఉన్నాయి. రూ.10000 కంటే తక్కువ ధరలో టాప్‌ స్మార్ట్‌ఫోన్‌లు (Smartphones Under RS10,000), పూర్తి వివరాలు.

శాంసంగ్ గెలాక్సీ A14 స్మార్ట్‌ఫోన్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ (Samsung Galaxy A14) 6.6 అంగుళాల (2408*1080 పిక్సల్స్‌) FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. Exynos 1330 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OS తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ట్రిపుల్‌ కెమెరాలతో అందుబాటులో ఉంది. 50MP ప్రైమరీ, 2MP, 2MP కెమెరాలను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

Diwali sale top smartphones under rs10000 in india

ఈ హ్యాండ్‌సెట్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8999 గా ఉంది. అదే మిగిలిన రెండు వేరియంట్‌లు.. రూ.9,999, 10,999 గా ఉన్నాయి. బ్యాంకు ఆఫర్‌లతో మరింత తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

పోకో M6 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఈ హ్యాండ్‌సెట్ (Poco M6 5G Smartphone) 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 రక్షణను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MIUI 14 OS తో పనిచేస్తుంది. 50MP AI కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాలతో అందుబాటులో ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 6GB స్టోరేజీ, 4GB ర్యామ్ + 128 స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.7,999 గా ఉంది.

లావా Yuva 3 స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ (Lava Yuva 3 Smartphone) 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టాకోర్‌ Unisoc T606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 13MP ప్రైమరీ కెమెరా + 5MP సెల్ఫీ కెమెరా. 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6999 గా ఉంది.

రెడ్‌మి 13C 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఈ హ్యాండ్‌సెట్ (Redmi 13C 5G Smartphone) 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6,74 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OS, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP AI కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 8MP కెమెరాలతో అందుబాటులో ఉంది.

18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh ‌బ్యాటరీతో పనిచేస్తుంది. రెడ్‌మి 13c 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. అమెజాన్‌లో 4GB ర్యామ్‌ వేరియంట్‌ను రూ.8999 కే కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Diwali special sale 2024 top smartphones under rs10000 in india specs features sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X